ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుర్మిత్ రామ్ రహీమ్ కు సంబంధించిన రహస్యం రోజుకు ఒకటి చొప్పున వెలుగులోకి వస్తోన్నాయి .ఈ క్రమంలో ఇద్దరు సాధ్వీఅలి అత్యాచారం చేశాడు అనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు చెందిన డేరా సచ్చా సౌదా గురించి ఒక సంచలనాత్మక విషయాన్నీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
.ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదు అని ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలను కల్గి ఉన్నాడు అని తెల్పింది .ఈ రోజు పంజాబ్ ,హర్యానా రాష్ట్రాల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డేరా బాబా ఆస్తుల విలువ మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల యాబై మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ప్రకటించింది .అయితే ఈ ఆస్తి విలువ ఒక్క డేరా బాబా ప్రధాన కార్యాలయం సిర్పాలోనివి అని పేర్కొన్నది .
అయితే రాష్ట్ర వ్యాప్తంగా గుర్మీత్ రహీమ్ కు ఇంకో పదహారు వందల కోట్ల రూపాయల అస్తులున్నట్లు ప్రకటించింది .అయితే ఇటీవల డేరా బాబాకు శిక్ష పడిన సమయంలో బాబా అనుచరులు కల్గించిన నష్టాన్ని పూడ్చడానికే ప్రభుత్వం ఆస్తుల లెక్క తేల్చడానికి ప్రయత్నాలు మమ్మురం చేసిన సంగతి విదితమే .అయితే ఈ ఆస్తుల ప్రకటన మీద నెటిజన్లు అప్పుడే సెటైర్లు వేస్తోన్నారు .అదే తనకు ఇంతవరకు ఉంగరం ,వాచ్ లేదని చెప్పుకునే పక్కరాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి .అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పోల్చుకుంటే బాబాకే ఎక్కువ ఆస్తులున్నాయి అని సెటైర్ల మీద సెటైర్లు వేస్తోన్నారు .