ఇటీవల విడుదలైన “జై లవకుశ “మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్న సంగతి విదితమే .బాబీ దర్శకుడిగా ప్రముఖ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాశి ఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు .అయితే తాజాగా మరోవైపు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఎన్వీఎస్ ప్రసాద్ నిర్మాతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల ధియేటర్లలో ఈ మూవీ రీలీజ్ అవుతుంది .అయితే మొన్న జై లవకుశ విజయోత్సవ వేడుక జరిగిన సంగతి విదితమే .
ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి కొన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి సినిమాలను తీసి విడుదల చేస్తుంటే సినిమాలపై ఇంతకుముందు ఈ రివ్వ్యూలు ఎవరు రాయకపోవడం వలన అభిమానులకు ,ప్రేక్షకులకు నచ్చిన నచ్చకపోయిన పది రోజుల పాటు మన సినిమాలు ఆడుతుండేవి .దీంతో నిర్మాతకు లాభాలు రాకపోయినా కానీ నష్టాలు మాత్రం వచ్చేవి కావు .కానీ నేడు రివ్యూ లు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ లో తెలుగు సినిమా ప్రేక్షకులు స్పందన రోజురోజుకు తగ్గిపోతుంది .
దీనివలన ప్రస్తుతం చావుబతుకుల్లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీను దారినపోయే దానయ్యలు చంపేస్తున్నారు” అంటూ విశ్లేషకుల వైఖరిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే మరోవైపు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం వేరే విధంగా స్పందించారు .ఆయన మాట్లాడుతూ “ప్రస్తుతం సినిమాలు బాగుంటే రివ్యూ లలో సినిమా బాగుంది ..బాగోకపోతే బాగోలేదు అని కదా రాస్తారు .కానీ రివ్యూ ల మీద ప్రస్తుతం చాలా వివాదాలు జరుగుతున్నాయి .ఆ వివాదాలపై నేను ఏమి మాట్లాడను కానీ సినిమా బాగుంటే బాగుంది ..బాగోకపోతే బాగోలేదు అని కదా రివ్యూ లు రాసేది .ఇంత లాజిక్ మరిచిపోతే ఎలా అని ఆయన అన్నారు ..