వివిధ కారణాలతో కనుమరుగైన చెరువుల పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఆదేశించారు. ఆయా చెరువులను పునరద్ధరించలేని పక్షంలో అటవీ లేదా ఇతర శాఖలకు ఆ ప్రదేశాలు కేటాయించాలని మంత్రి నిర్ణయించారు. దీని కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని మైనర్ ఇరిగేషన్ సి.ఈ. లు శ్యామ్ సుందర్, సురేశ్ లను హరీష్ రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు వివరాలను సమగ్రంగా నమోదు చేసేందుకు గాను కడెం ప్రాజెక్టును పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని హరీష్ రావు ఆదేశించారు. కడెం ప్రాజెక్టు ఆయకట్టు ఫలితాలను ఆధారం చేసుకొని మిగతా ప్రాజెక్టులకు కూడా వర్తింపజేయాలని మంత్రి కోరారు.
రాష్ట్రం లోని భారీ, మధ్య తరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న 8177 కాలువలు 22700 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నట్టు ఉపగ్రహం ద్వారా చిత్రీకరించిన ఫోటోలు వెల్లడించాయి. ఆయా ప్రాజెక్టుల ప్రధాన కాలువలతో పాటు, డిస్ట్రిబ్యూటరీలు, సబ్ డిస్ట్రిబ్యూటరీలు,వాటి పరిధిలో సాగునీటి సరఫరా, ఆయా కాలువల పరిస్తితి, సామర్ధ్యమ్ తద్ధితర అంశాలను కూడా శాటిలైట్ సాయంతో ఇరిగేషన్ అధికారులు నమోదు చేశారు. అలాగే వివిధ ప్రాజెక్టులు, కాలువల కింద పంటల వివరాలను సైతం నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కెనాల్స్ వివరాలేవీ రికార్డు కాలేదు. వాటి దుస్థితిపై ఎక్కడా వివరాలు లేవు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగం పై ప్రత్యేక దృష్టి పెట్టినందున కాలువల పూడిక, వాటికి మరమ్మతులు చేయవలసిన రిజర్వాయర్ లలో ఇన్ ఫ్లోస్, ఔట్ ఫ్లోస్ ,వంటి వివరాలను నమోదు చేసి విశ్లేషించే ప్రక్రియ సాగుతున్నది. రాష్ట్రం లో ఇంతవరకు 43 వేల చెరువులను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ పూర్తి కావచ్చినదని అధికారులు మంత్రికి వివరించారు.జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా కూడా జలవనరులు, సాగునీటి వసతి, ఇతర సమాచారాన్ని శాటిలైట్ సహకారం తో నమోదు చేస్తున్నారు.
ఉపగ్రహం ద్వారా జలవనరులను విశ్లేషించే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ పని తీరును మంత్రి హరీష్ రావు బుధవారం పరిశీలించారు. గత ఏడాది ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో రాష్ట్ర నీటిపారుదల శాఖ అవగాహన కుదుర్చుకున్నది.తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ పని తీరు పై అధికారులు జలసౌధలో సమగ్రంగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఇందులో భాగంగా సి.జి.జి. సహకారంతో డ్యాష్ బోర్డు ను కూడా యేర్పాటు చేశారు. రాష్ట్రం లోని గ్రౌండ్ వాటర్,సాగునీటి ప్రాజెక్టుల ఆధారిటీలు, ప్లానింగ్ డెపార్ట్మెంటు, ఫైనాన్సు, ఐ. ఏం.డి విభాగాలు, శాఖల సహకారాన్ని ఆన్ లైన్ లో వెబ్ సర్వీసు ద్వారా సేకరిస్తున్నారు. ఇరిగేషన్ రంగంలో ఇదొక సరికొత్త విప్లవం . అరచేతిలో జలవనరుల సమాచారం తెలుసుకునేందుకు సాంకేతికతను ఇరిగేషన్ శాఖ ఉపయోగించుకుంటున్నది.రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపగ్రహం సాయంతో తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను గత ఏడాదే ఏర్పాటు చేసుకున్నది.
జలవనరుల సమాచారాన్ని ఉపగ్రహం ద్వారా నమోదు చేసి వాటిని విశ్లేషించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. టీ.డబ్ల్యూ.ఆర్.ఐ.ఎస్‌ను ఇరిగేషన్ శాఖలోని ఇంజనీర్లు.. ముఖ్యంగా యువ ఇంజనీర్లు పూర్తిగా వినియోగించుకోవాలని హరీష్‌రావు సూచించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా మిషన్ కాకతీయకు ముందున్న చెరువుల పరిస్థితిని.. ఇప్పటి పరిస్థితితో పోల్చి విశ్లేషించారు. . బ్యారేజీలు, డ్యామ్‌లు, కాల‌్వలను ఉపగ్రహ చిత్రాలతో గుర్తించాలని హరీష్‌రావు ఆదేశించారు. ఈ వ్యవస్థతో రాష్ట్రంలోని జలవనరులు ఎక్కడెక్కడ ఎంతెంత నిల్వలు ఉన్నాయో క్షణాల్లో తెలిసిపోతుంది.రైన్ ఫాల్ ని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఫ్లడ్ కంట్రోల్ రూంతోను తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థను అనుసంధానం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. తెలంగాణ జలవనరుల సమాచార వ్యవష్ట కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఇంజనీర్లందరినీ పేరు పెరుణా మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌రావుతో పాటు ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, సెక్రెటరీ వికాస్ రాజ్, ఈ .ఎన్.సి. మురళీధర్ రావు,కాడా కమిషనర్ డాక్టర్ మల్సూరు, సి.ఈ లు లింగరాజు, వెంకటేశ్వర్లు,శ్యాంసుందర్,సురేశ్ కుమార్, మధుసూధనరావు , ఇరిగేషన్ శాఖ ఓఎస్‌డి శ్రీధర్‌రావు దేశ్‌పాండే, స్పెషల్ ఆఫీసర్ కె.ప్రసాద్ పాల్గొన్నారు.