Home / CRIME / ఐరన్ బాక్సు వేడి చేసి భార్య జననాంగాన్ని కాల్చాడు.. అంతటితో ఆగకుండా

ఐరన్ బాక్సు వేడి చేసి భార్య జననాంగాన్ని కాల్చాడు.. అంతటితో ఆగకుండా

సమాజం ఎటు వైపు పరుగు పెడుతుంది. మరి ఇంత దారుణంగా మహిళలపై దాడులు చేయ్యడం నిజంగా సిగ్గు చేటు. వీడు చేసిన ఘటన చాలా దారుణంగా ఉంది. తన భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదనే కోపంతో పీకల దాకా మద్యం తాగిన భర్త అత్యంత దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాన్స్‌వాడి పట్టణంలో వెలుగుచూసింది. దిలీప్‌కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లాడాడు. భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదని తరచూ ఆమెతో గొడవపడుతుండే వాడు. పీకల దాకా మద్యం తాగిన దిలీప్ కుమార్ ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆపై ఐరన్ బాక్సు వైరుతో భార్యను కొట్టాడు. అంతటితో ఆగకుండా ఐరన్ బాక్సు కరెంటు ప్లగ్ కు పెట్టి వేడి చేసి దాంతో భార్య జననాంగాన్ని కాల్చాడు. తీవ్ర గాయాల పాలైన భార్య స్పృహ తప్పి పడిపోయింది. దీంతో భార్య తల్లిదండ్రులు వచ్చి ఆమెను అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడైన దిలీప్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat