ప్రపంచం మొత్తంగా ప్రాణాంతక గేమ్ తో ఎందరో ప్రాణలు వదిలారు. తాజాగా తమిళనాడులోని దిండుగల్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని హాస్టల్ భవనం మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణాంతక ‘బ్లూవేల్’ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు
అనుమానిస్తున్నారు. శివగంగ జిల్లా మునియాండిపురానికి చెందిన భరణిదాస్ కుమార్తె తరణి(19) దిండుగల్‌లోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీఈ రెండో సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ కళాశాలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామున తరణి హాస్టల్ భవనం మూడో అంతస్థుపై నుంచి కిందకు దూకింది.