మొన్న కలకత్తా ఇండోర్ స్టేడియంలోటీం ఇండియా -ఆసీస్ ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. గత నాలుగేళ్ల రోహిత్ కెరీర్ ను పరిశీలిస్తే ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అతడు ఈ నాలుగేళ్లలో ఓపెనర్‌గా 79 ఇన్నింగ్సుల్లో 113 సిక్స్‌లు బాదాడు.
ఇక రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ 86 ఇన్నింగ్సుల్లో 106 సిక్స్‌లు బాదాడు.అంతర్జాతీయ క్రికెట్ లో చూసుకుంటే ఓపెనర్‌గా రోహిత్ 143 ఇన్నింగ్స్‌ల్లో 169 సిక్స్‌లు బాదాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ 158 ఇన్నింగ్సుల్లో 153 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఎక్కువ సిక్స్‌లు బాదింది ఆస్ట్రేలియాపైనే కావడం విశేషం.
భారత్-ఆసీస్ మధ్య ఇండోర్‌లో ఆదివారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ నాలుగు సిక్స్‌లు నమోదు చేయడంతో అప్పటి వరకు కంగారూలపై అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ అధిగమించినట్లయింది. కేవలం వన్డేల్లోనే రోహిత్ ఆసీస్‌పై 48 సిక్స్‌లు బాదాడు. ఆసీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ 65 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా సచిన్(60), ధోనీ(49) మూడు, ఆరో స్థానంలో ఉన్నారు.