తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. పెద్దేముల్ మండలం గాజీపూర్‌లో గొల్లకురుమలకు మంత్రి మహేందర్‌రెడ్డి గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కులవృత్తులను ప్రోత్సహిస్తూ.. వారి ఆదాయం పెంచుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ. 4 వేల కోట్లతో 84 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశారని చెప్పారు. జిల్లాలో 20,580 మందికి రూ. 25 కోట్లతో గొర్రెలు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల ముందు ఇవ్వని హామీలనూ కూడా సీఎం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
