Home / MOVIES / ఎన్టీఆర్ నటన పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పోసాని..!

ఎన్టీఆర్ నటన పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పోసాని..!

టాలీవుడ్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఈ మద్య బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు భిన్నంగా జై లవ కుశ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు యంగ్ టైగర్.

తాజాగా జై లవ కుశ చిత్రం సక్సెస్ మీట్ జరిగిన నేపథ్యంలో రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ పొగిడేశారు. సాధారణంగా జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్‌ ఉంది. పాల కేంద్రంలో పాల చిక్కదనం చెప్పడానికి లాక్టోమీటర్‌ ఉంటుంది. రక్తంలో షుగర్‌ స్థాయి చెప్పడానికి గ్లూకో మీటర్‌ ఉంటుంది. మరి ఎన్టీఆర్ నటన కొలవడానికి ఏ మీటర్ ఉంటుందో చెప్పగలరా.. చెప్పగలం ఆయన నటనను కొలిచేందుకు ఓ మీటర్ ఉంది.. అదే ఈస్తటిక్‌ మీటర్‌. ఇంతకీ ఈస్తటిక్ మీటర్ అంటే ఏంటో అనుకుంటున్నారా.. తెలుగులో రసహృదయం. అది ఉన్న వారికి ఎన్టీఆర్‌ ఎంత దమ్ము ఉన్నవాడో తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌తో టెంపర్‌, జై లవకుశ చిత్రాల్లో న‌టించాన‌ని.. సినిమాలు అంటే తారక్‌కి ఎంతో అభిమానమని.. నటన పరంగా ఆయన ముందు ఎవరూ సరిపోరని ఎన్టీర్ పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసారు పోసాని కృష్ణ‌ముర‌ళి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat