ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మిత్రపక్ష పార్టీ జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేసినట్లు జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే ఈ అవార్డు రావడం వెనక టీడీపీ నేతల హస్తం ఉంది అని వార్తలు వస్తోన్నాయి .ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది .యతధంగా మీకోసం ..
వాళ్ళు అవార్డు ఎందుకు ఇస్తున్నారొ చెబుతు..
1) కొట్ల మంది అభిమానులని చొరగొన్న నటుడిగా అంట — ఇంత కన్న ఎక్కువ అభిమానులు ఉన్న రజనీ కాంత్ , కమల్, అమితాబ్ గారు ఎందుకు ఈ కెటగిరి లొకి రాలేదు
2) సమున్నత ఆశయాలు ఉన్న రాజకీయ నాయకుడిగా – ఆయన ఆశయం ఇజం బుక్ ద్వారా చెప్పారు దానికి పేరుమొసిన రైటర్స్ , చత్త బుక్ అని తేల్చేశారు – ఆయన సమున్నత ఆశయాలు తెలపాలి అంటే జనసేన మ్యానిఫెస్టొ చూడాలి అది ఇంతమటికి విడుదల కాలేదు.
3) గొప్ప మానవాత వాది అంట – దీనికి ఆయన చెసిన సామాజిక సేవలు ఎంటి ? కొట్ల రెమ్యునేషన్ తీసుకుని కనీసం వారి అభిమానులకి సైతం సినిమా ఫ్రీగా చుపించని ఈయన మానవతా వాది అంటే. ఇంక సమాజ సేవకే జీవితాలని అంకితం చెసేవారు ఎమవుతారు…
4) ఉద్దానం లొ కిడ్నీ భాదితులపై చూపిన చొరవ అంట – ఈ ఉద్దానం మీద ఒక్క పవన్ కళ్యానే కాదు అంతక ముందు ఎంతొ మంది స్టొంబ్రూక్ యునివర్సిటి నుండి రంగరాయ మెడికల్ కాలేజీ దాక ఎన్నొ సంస్థలు సంస్య పై చొరవ చూపాయి నిజానికి దీనిని వై.యస్ హయాము లొ మొట్టమొదట అంతర్జాతియ స్థాయికి ప్రభుత్వ చొరవతొ తీసుకుని వెళ్ళి అప్పటి నుండి ఇప్పటిదాక పొరాడుతున్న డాక్టర్ రవిరాజా గారికి ఇవ్వాలి ఇలాంటి వి
5) చెనేత బ్రాండ్ అంబాజిడర్ – ఇది ఒక ఫార్సు — మంగలగిరి లొ చెనేత సభకి వెళ్ళి అండగా ఉంతా అని చెప్పి బ్రాండ్ అంబాజిడర్ గా ప్రకటించుకుని , జి.యస్.టి లొ చెనేతకి కొలుకొలెని దెబ్బ తగిలితే కనీసం ఒక ప్రస్ నొట్ కూడా విడుదల చెయని ఈ పవన్ కల్యాణ్ కి చెనేతకు వెన్ను దన్ను గా ఉన్నారు అని పచ్చి అబ్బదాలు చెప్పటం హీనమైన చర్య
6) సమాజిక సమస్యల పరిష్కారం లొ పవన్ చూపుతున్న చొరవ – ఆయనదగ్గర ఉండి పూర్తిగా రూపుమాపిన సమస్య ఒక్కటి కూడా లేదు ఆయన ఇప్పటి దాక ఏ సమస్య కి ఏ పరిష్కారం చూపారు ఏం సమస్య ఆయన చూపిన పరిష్కారం వలన తీరిపొయిందొ చెప్పాలి.
ఇన్ని వైఫల్యాలు ఎదురుగా ఉంటే ఈ ఆవార్డు వెనుక మర్మం లొకేష్ గారి ఒబామా ఫొటొ మాదిరి సెటప్ ఏమొ అని సామాన్యుల అనుమానం…