ఆదిలాబాద్ ప్రాజెక్టులు-వాస్తవాలు
సెప్టెంబర్ 11న అమరుల స్ఫూర్తియాత్ర సందర్భంగా జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసింది లేదు, రైతాంగానికి చుక్క నీరిచ్చింది లేదు అన్నట్లుగా వార్తాపత్రికలు ప్రచురించాయి. జిల్లాకు జీవనాధారమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును బొందపెట్టి కాళేశ్వరం మొదలుపెట్టారని, అదైనా పూర్తిచేశారా అంటే అదీ లేదని దెప్పిపొడిచారు.ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు పూర్తిగా అవాస్తవమే కాదు, ఆశ్చర్యం కలిగించేవి కూడా ఆదిలాబాద్ జిల్లాలో మైనర్, మీడియం ప్రాజెక్టుల కింద ఈ మూడేండ్లలో కొత్తగా 1,87,745 ఎకరాలకు నికరంగా సాగునీటి సదుపాయం కల్పించారు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి చుక్కనీరు అందించలేదన్న కోదండరాం ప్రకటనను తిరస్కరించక తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వివక్షకు గురైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులను కేటాయిస్తున్నది. ఆ ప్రాధాన్యాలను అనుసరించే ఈ రెండు జిల్లాల్లో పనులు సాగుతున్నాయి.ఆప్రకటనలు జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నందున జిల్లావాసిగా వాస్తవాలను, జిల్లాలో జరుగుతున్న అభి వృద్ధిక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పే బాధ్యత నాపై ఉన్నది. ఈ మూడేండ్లలో సాగు నీటి రంగంలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పురో గతి సంక్షిప్తంగా..
మైనర్ ఇరిగేషన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత పదేండ్లుగా భూ సేకరణ సమస్యల కారణంగా పెండింగ్‌లో ఉన్న 34 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేసి వాటికింద సుమారు 25 వేల ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చారు. జపాన్ ఆర్థిక సహకారంతో ప్రారంభమైన 47 మైన ర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 43 ప్రాజెక్టులను పూర్తిచేసి 28 వేల ఎకరాలు సాగులోకి తెచ్చారు. మూడు దశల్లో అమలైన మిషన్ కాకతీయ పను లతో 75 వేల ఎకరాలు స్థిరీకరించారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు లక్షా యాభై వేల ఎకరాలు చెరువుల కింద సాగులోకి తెచ్చారు. తెలం గాణ ఏర్పడిన తర్వాత కొత్తగా సాగులోకి వచ్చిన భూమి లక్షా ముప్ఫై వేల ఎకరాలు. జిల్లాలో ఇప్పుడు వీటికింద సాగులో ఉన్న మొత్తం భూమి 1.80 లక్షల ఎకరాలు మీడియం ఇరిగేషన్: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పునరావాసం కోసం 20 కోట్లు చెల్లించి ముంపు గ్రామాలను ఖాళీ చేయించి 2016లో మొద టిసారిగా జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నింపారు. ఈ ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉంటే గతంలో రెండు వేల ఎకరాల కు మించి సాగు జరుగలేదు. కాలువలను ఆధునీకరించడం వల్ల 2016 లో 12 వేల ఎకరాలకు నీరందించగలిగారు. 29 చెరువులను నింపారు. 2018 వానకాలం నాటికి మొత్తం 14 వేల ఎకరాలకు సాగు నీరందిం చేందుకు పనులు జరుగుతున్నాయి. మత్తడివాగు: గత పదేండ్లుగా రైల్వే క్రాసింగ్ పనులు పూర్తి చేయనం దున ఎడమ కాలువ కింద 8,500 ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరం దలేదు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం రైల్వే క్రాసింగ్ పనులు పూర్తిచేసి అదనంగా 1600 ఎకరాలను సాగులోకి తెచ్చింది. కొమురంభీమ్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 161 ఎకరాల అటవీ భూమి అనుమతి పొందిన తర్వాత ఎడమ కాలువ పనులు పుం జుకున్నాయి. 2016లో ఎడమ కాలువ కింద మొత్తం 39,500 ఎకరా ల్లో 18 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. గతంలో 8 వేల ఎకరాలకే సాగునీరు అందింది. మిగతా కాలువ పనులు జూన్ 2018 నాటికి పూర్తిచేసి 45,500 ఎకరాలకు నీరందిస్తారు.చనాఖా కొరాటా బ్యారేజీ: ఆదిలాబాద్ జిల్లా తాంసి, జైనథ్, బేల మండలాల ప్రజల 40 ఏండ్ల కల పెనుగంగ ప్రాజెక్టు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించకపోవడంతో పెన్‌గం గ కలగానే మిగిలిపోయింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం మహా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పెన్‌గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై బ్యారేజీల నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నది. చనాఖా కొరాట బ్యారేజీ నిర్మాణానికి 1500 కోట్లు మంజూరు చేసింది. బ్యారేజీ, పంప్‌హౌజ్, కాలువల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 2018 వానకాలం నాటికి పాక్షికంగా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్య లు తీసుకున్నారు. సదర్మాట్ బ్యారేజీ: సదర్మాట్ ఆనకట్ట కింద ఉన్న ఆయకట్టుకు శ్రీరాంసాగర్ డ్యాం నిర్మాణం తర్వాత నీరందక ఆయకట్టు దెబ్బతిన్నది. కాలువలు నిర్వహణ లేక శిథిలమైపోయాయి. సదర్మాట్ ఆనకట్టను బ్యారేజీగా మార్చమని 40 ఏండ్లుగా ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం గోదా వరికి ఎడమవైపున నిర్మల్ జిల్లాలో సదర్మాట్ ఆయకట్టుకు (18 వేలు), కుడివైపున కరీంనగర్ జిల్లాలో గంగానాల ప్రాజెక్టు ఆయకట్టు (5వేలు) స్థిరీకరించడానికి 600 కోట్లతో 1.58 టీఎంసీల నిల్వ సామ ర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
బ్యారేజీ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణంతో సదర్మాట్ ఆయకట్టు రైతుల నలభై ఏండ్ల కడగండ్లు తీరిపోతాయి. బాసర చెక్‌డ్యాం: బాసర జ్ఞాన సరస్వతి దేవి ఆలయం సందర్శించే భక్తుల సంప్రదాయ కార్యక్రమాల కోసం, బాసరలోని ప్రతిష్ఠాత్మక ఐఐ ఐటీకి సరిపడా తాగునీటిని సరఫరా చేయడానికి గోదావరి నదిపై బాసర దగ్గర చెక్‌డ్యాం చేపట్టాలని ఎంతోకాలంగా ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై బాసర వద్ద చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టడానికి 33 కోట్లు మంజూరుచేసి పనులు ప్రారంభించింది. 2018 నాటికి చెక్‌డ్యాం నిర్మాణం పూర్తిచేసి బాసర యాత్రీకులకు, విద్యార్థులకు శాశ్వత నీటి సౌకర్యం కల్పించను న్నది. ప్రాజెక్టుల ఆధునీకరణ: ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తయిన సాత్నాలా, స్వర్ణ, వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టులను ఆధునీకరిం చడానికి, కడెం, సరస్వతి కాలువ, సదర్మాట్ కాలువలను ఆధునీకరిం చడానికి ప్రభుత్వం CADWM పథకంలో నిధుల మంజూరీ కోసం ప్రతి పాదనలు పంపింది. ఈ పథకం రాకముందే ప్రభుత్వం చెలిమెల వాగు కాలువల ఆధునీకరణ కోసం 22 కోట్లు మంజూరుచేసింది. పనులు సాగుతున్నాయి.
కుప్టి ప్రాజెక్టు: బోథ్ నియోజకవర్గంలో కదంలాంటి పెద్ద నది ప్రవ హిస్తున్నా గత ప్రభుత్వాలు ఈ నియోజకవర్గంలో ఒక్క మీడియం ప్రాజెక్టునూ, మేజర్ ప్రాజెక్టును గానీ రూపకల్పన చెయ్యలేదు. కడెం జలాశయం ఎత్తు పెంచాలనే డిమాండ్ చాలాకాలంగా ఉన్నది. ఎత్తు పెంచితే కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 12 చదరపు కిలోమీటర్ల అడవి ముని గిపోతుంది. నాలుగు గ్రామాలు మునిగిపోతాయి. ప్రత్యామ్నాయాలు ఆలోచించిన తర్వాత కడెంకు నీరందించడానికి, ఇకో టూరిజం ప్రాం తంగా అభివృద్ధి అయిన కుంటాల జలపాతానికి జనవరి నుంచి జూన్ దాకా పరిమితంగానైనా నీరందించడానికి కుప్టి వద్ద 6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. డీపీఆర్ తయారైంది. త్వరలోనే కుప్టి ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది.
తుమ్మిడిహట్టి: కోదండరాం ఆరోపించినట్లు తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ప్రభుత్వం బొంద పెట్టలేదు. పైగా గతంలోకంటే ఎక్కువ ఆయకట్టును సాగులోకి తీసుకవస్తున్నది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభు త్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. 148 మీటర్ల పూర్తి నీటిమట్టంతో ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకారం కుదిరింది. ఆదిలాబాద్ తూర్పు జిల్లా లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వేలు పూర్తయినా యి. మన రాష్ట్రంలో భూ సేకరణ ఊపందుకున్నది. త్వరలోనే బ్యారే జీ పనులు ప్రారంభమవుతాయి.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2018 వానకాలం నాటికి పాక్షికంగా గోదావరి నీటిని ఎత్తిపోసి తాగునీటి అవస రాలు తీర్చడానికి, చెరువులను నింపడానికి ప్రణాళికాబద్ధంగా పనులు సాగుతున్నాయి. ఇది కోదండరాం గారికి తెలియవని అనుకోలేం. ఆదిలాబాద్ జిల్లాలో మైనర్, మీడియం ప్రాజెక్టుల కింద ఈ మూడేం డ్లలో కొత్తగా 1,87,745 ఎకరాలకు నికరంగా సాగునీటి సదుపాయం కల్పించారు. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి చుక్కనీరు అందించలేదన్న కోదండరాం ప్రకటనను తిరస్కరించక తప్పడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వివక్షకు గురైన మహబూబ్‌నగర్, ఆదిలా బాద్ జిల్లాల్లో సాగునీటి వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులను కేటాయిస్తున్నది. ఆ ప్రాధాన్యాలను అనుసరించే ఈ రెండు జిల్లాల్లో పనులు సాగుతున్నాయి. వాటి ఫలితాలు ప్రజల అనుభవం లోకి వస్తున్నాయి.
source : Sri Nivas