Home / SLIDER / రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు

రేపటి నుంచి మినుముల కొనుగోలు.. మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో మినుముల కొనుగోలుకు రేపు 14 ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. పెసర్లు, మినుములు, పత్తి తదితర పంటల దిగుబడి, మార్కెట్ లో ప్రస్తుతమున్న ధర, రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు మంత్రి హరీశ్ రావు పలు సూచనలు చేశారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు మినుములు తీసుకురావాలని హరీశ్ రావు కోరారు.

ఈ ఖరీఫ్ లో 6680 టన్నుల మినుములను కొనుగోలు చేసేందుకు వెంటనే నాఫెడ్ తరపున మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులకు నిర్దేశించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో క్వింటాల్ మినుములకు 2,500 రూపాయల నుంచి 4,615 రూపాయలు మాత్రమే రైతులకు లభిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మినుములకు మద్దతు ధరను సాధారణంగా అక్టోబర్ 1 న ప్రకటిస్తుందని, తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి తక్షణం షెడ్యూలు తేదీలకు మినహాయింపు ఇచ్చిందని హరీశ్ రావు తెలిపారు. క్వింటాల్ మినుములకు 5400 రూపాయలు మద్దతు ధర ఉన్నందున అంతకన్నా తక్కువ ధరకు రైతులెవరూ తొందరపడి అమ్ముకోవద్దని మంత్రి సూచించారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజామాబాద్ జిల్లాలో బోధన్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, నారాయణ ఖేడ్, వట్పల్లి, నిర్మల్ జిల్లాలో కుబెర్, భైంసా, జైనూర్, ముధోల్, వికారాబాద్ జిల్లా తాండూర్, వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు, డి.సి.ఎం.ఎస్ లలో మినుముల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మార్క్ ఫెడ్ అధికార యంత్రాంగాన్ని హరీశ్ రావు ఆదేశించారు. పెసర్ల లాగే మినుములకు కూడా మద్దతు ధరను షెడ్యూలు కన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పెసర్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, నాఫెడ్ విధించిన నాణ్యతా ప్రమాణాలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ప్రత్యేక మెసెంజర్ ద్వారా ఢిల్లీకి నిన్ననే పంపినట్టు హరీశ్ రావు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat