ఇన్కార్పొరేషన్ (ATAI ) ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, అందంగా ముస్తాబైన ప్రథమ ద్వితీయ బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు బంగారు నాణేలను అందించారు.ఈ సందర్బంగా ATAI అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి దేశం మాట్లాడుతూ, తాము తెలంగాణ సంస్కృతిని ఖండాన్తరాల్లో చాటిచెప్పేందుకు గత నాలుగు సంవత్సరాలుగా ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వస్తున్నామనీ, ఇట్టి బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ అభినందించారు.టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సహకారంతో ఈ సంవత్సరం కూడా మునుపెన్నడూ ఎరుగని విధంగా కనీ వినీ ఎరుగని రీతిలో ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పాటుపడుతూ తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాలను ఆస్ట్రేలియాలోవిస్తరించడానికి తమవంతు కృషిని అందిస్తామని తెలిపారు.