తెలంగాణ రాష్టంలో ఇటీవలే వేతనాల పెంపుతో బల్దియా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉపశమనం కల్పించిన ప్రభుత్వం.. మరణించిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరణించిన కార్మికుల భర్త లేదా భార్య, మేజర్ అయిన కూతురు, కుమారుడు, మనుమడు లేదా మనుమరాలును కార్మికుడిగా నియమించుకునేందుకుగాను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి కార్మికుల హాజరును బయోమెట్రిక్ పద్ధతిలో స్వీకరిస్తున్నట్టు, గత ఏడాది డిసెంబర్ నుంచి కొత్త కార్మికులను నియమించలేదని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మధ్య కొందరు కార్మికులు మరణించగా, మరికొందరు అనారోగ్యంతో ఉన్నట్టు, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తులు వస్తున్నట్టు కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన ప్రభు త్వం వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అధికారాన్ని కమిషనర్‌కు కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
Tags BALDIA OUTSOURCING EMPLOYEES GHMC kcr