తెలంగాణ ప్రజల సంస్కృతి విశిష్ట చిహ్నమైన బతుకమ్మ ఖ్యాతి మరింత విశ్వవ్యాప్తం కానుంది. విమానాల్లో బతుకమ్మ మాట వినిపించనుంది. విమానాశ్రయాల్లో మహిళా ప్రయాణికులకు బతుకమ్మ బ్రోచర్లు పంపిణీ చేయనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఇండిగో, జెట్, స్పైస్ జెట్‌తో పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకునటన్లు తెలిపారు.
దేశీయ, విదేశీ విమాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్సైస్ జెట్ విమానయాన సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని, విమానాల్లోని ప్రతి మహిళా ప్రయాణికురాలికి బతుకమ్మ ఫెస్టివల్ ప్రత్యేకత, విశిష్టత, వేడుక నిర్వహణను తెలిపే బ్రోచర్‌ను ఇస్తున్నామని బుర్ర వెంకటేశం వివరించారు. విమానాల్లో మహిళా ప్రయాణికులకు అందజేస్తున్న బ్రోచర్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. ఆరు లక్షల మంది మహిళా ప్రయాణికులకు బతుకమ్మ బ్రోచర్లు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఒప్పందం చేసుకున్న మూడు విమాన సర్వీసుల్లో విమాన ప్రయాణాల్లో ప్రయాణికులకు ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ గురించి ప్రకటన (అనౌన్స్‌మెంట్) వినిపిస్తారని తెలిపారు.
దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో బతుకమ్మ ఉత్సవాలను ప్రచారం చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా కార్యదర్శి బుర్రా వెంకటే వివరించారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న నగరంలో బతుకమ్మ పండుగ సందర్భంగా పర్యాటకుల్ని ఆహ్వానించేందుకు చేస్తున్న ఏర్పాట్లు ఫలిస్తే కోట్ల రూపాయలు అదాయం వస్తుందని, నగరంలోని వివిధ వ్యాపార వర్గాలకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు.