బాలీవుడ్‌లో జుడ్వా 2చిత్రంలో వరుణ్ పక్కన తాప్సీ పొన్ను, జాక్వలైన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన జుడ్వా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్‌లో హీరో, హీరోయిన్లు బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోయిన్ జాక్వలైన్ కారులో వరుణ్ అర్థనగ్నంగా మీడియాకు చిక్కారు. కారులో అసలేం జరిగిందంటే..
వారాంతంలో గాయని ఫాల్గుని పాథక్ నిర్వహించిన దాండియా నైట్‌కు వరుణ్ ధావన్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ హాజరయ్యారు. అక్కడ నుంచి అంబానీ నివాసం ఆంటీలా జరిగే విందులో నేరుగా పాల్గొనాల్సి వచ్చింది. దుస్తులు మార్చుకోవడానికి సమయం లేకపోవడంతో జాక్వలైన్ కారులోనే వరుణ్ ప్యాంటు, షర్టు మార్చుకోవాల్సి వచ్చింది.
కారులో వరుణ్ దుస్తులు మార్చుకొంటుండగా జాక్వలైన్ మదిలో చిలిపి ఆలోచన వచ్చింది. వరుణ్ దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసింది. అంతటితో ఆగకుండా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వరుణ్ వీడియోతో పాటు జాక్వలైన్ ఓ పోస్ట్‌ను కూడా పెట్టింది. వరుణ్ ఓ పార్టీ నుంచి మరో పార్టీకి ఇలా వెళ్తాడు. నా కారులోనే బట్టలు మార్చుకొన్నారు. థ్యాంక్యూ వరుణ్. నా కారును నీవు చేంజ్ రూమ్ చేశావు అని జాక్వలైన్ ఓ సందేశాన్ని పెట్టింది. ఈ పోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యింది.