తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల ఉండటమే లక్ష్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణమే లక్ష్యంగా సర్కారు ముందుకు పోతుంది .
దీనిలో భాగంగా ముప్పై ఒక్క జిల్లాలో డబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి .ఈ రోజు రాష్ట్ర రోడ్డు భవనాల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పినపాక మండలంలో పర్యటించారు .
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల పినపాక మండలంలో ఐలపూరం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ “రాష్ట్రంలో అందరికి ఇండ్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం .రానున్న కాలంలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నేరవేరుస్తాం అని అన్నారు .