Home / EDITORIAL / పోలవరం ప్రాజెక్టు అధికార పార్టీ నేతల కు ,కాంట్రాక్టర్లకు వరం లాంటిది ..

పోలవరం ప్రాజెక్టు అధికార పార్టీ నేతల కు ,కాంట్రాక్టర్లకు వరం లాంటిది ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ను వచ్చే ఎన్నికల లోపు పూర్తిచేస్తాను అంటూ మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్న సంగతి విదితమే .పోలవరం ప్రాజెక్టు పేరిట అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు అని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే .ఇదే విషయం గురించి మాజీ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు .వాస్తవానికి ట్రాన్స్‌ట్రాయ్‌ని పక్కన పెట్టాలన్న నిర్ణయం తీసుకోవడానికి చెబుతున్న కారణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన లక్ష్యంలో 27 శాతం మాత్రమే ట్రాన్స్‌ట్రాయ్‌ చేరుకోగలిగిందని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ ఇంతవరకు చాలా విరివిగా ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఆ సంస్థ ఖర్చు చేసినదంతా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వచ్చినదే. ఈ విషయాన్ని చాలా పత్రికలు వెల్లడించాయి కూడా. కానీ నిర్మాణంలో మాత్రం తీవ్ర జాప్యం కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే ప్రభుత్వ పెద్దలకు, ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రమోటర్స్‌కు మధ్య గూడుపుఠాని జరిగి నట్టు స్పష్టంగా తెలుస్తుంది.

మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. రూ. 50,000 కోట్లు వ్యయం పెరిగిందని ప్రభుత్వం చెప్పగానే దానిని విశ్వసించి, ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే కేంద్ర ఆర్థిక, జలవనరుల మంత్రిత్వ శాఖలు నిధులు మంజూరు చేస్తాయా?.అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సరే, అసలు ట్రాన్స్‌ట్రాయ్‌ గురించే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక్కడే ఆ సంస్థ ఘనత గురించి మరొక విషయం గుర్తు చేయాలి. ఇటీవల మన రిజర్వు బ్యాంక్‌ ప్రకటించిన రుణాల ఎగవేతదారుల జాబితాలో ఈ సంస్థ పేరు కూడా ఉంది. ఈ సంవత్సరం ఆగస్ట్‌ చివరన వెల్ల డించిన వివరాల ప్రకారం రిజర్వు బ్యాంక్‌లో పేరుకుపోయిన (2017 జూన్‌ వరకు) మొత్తం నిరర్ధక ఆస్తులలో 25 శాతం 12 సంస్థల నిర్వాకమేనని బ్యాంక్‌ వెల్లడించింది. ఇక ప్రశ్నల విషయానికి వస్తే, ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ట్రాన్స్‌ట్రాయ్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించింది? రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్మును ట్రాన్స్‌ట్రాయ్‌ అనధికారికంగా మళ్లించిందా? ఒప్పందం మేరకే ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చెల్లించిందా? ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రాజెక్టు నిర్మాణం పేరుతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అనధికారికంగా ఈ నిధుల నుంచి కూడా ఏమైనా మళ్లించారా? ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తేవడం, నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చడానికి విన్యాసాలు చేయడం (మనీ ల్యాండరింగ్‌) వంటివి ఈ ప్రాజెక్టు విషయంలో చోటు చేసుకున్నాయా? ఇవన్నీ తప్పక వచ్చే ప్రశ్నలే. రిజర్వు బ్యాంక్‌ ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసేవారి జాబితాలో ట్రాన్స్‌ట్రాయ్‌ని చేర్చింది.

ఆర్బీఐ కొత్త నిబంధన ప్రకారం మిగిలిన ఎగవేత సంస్థల మీద అవినీతి కోణం నుంచి దర్యాప్తు జరిపినట్టే ట్రాన్స్‌ట్రాయ్‌ మీద కూడా దర్యాప్తు చేయించాలి. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదట పోలవరం ప్రాజెక్టులో భాగం కాదు. అయినా కేంద్ర జలవనరుల సంఘం అనుమతి లేకుండానే, రూ. 4,000 కోట్లతో వీటి పని ఆరంభించారు. అలాగే వీటికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లేవు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వీటి వ్యయాన్ని కూడా పోలవరం ప్రధాన పథకం అంచనాలలో అంతర్భాగం చేసింది. అందుకే పోలవరం కోసమే కేటాయించిన నిధులను ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లించింది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ప్రధానమైన పోలవరం ప్రాజెక్టుకు న్యాయం జరగదు. పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల గురించి ఎవరూ ప్రశ్నించలేదు. ఈ రెండు ప్రాజెక్టులతో ఎలాంటి అదనపు ప్రయోజనం లేదని తెలిసినా మూడు రాష్ట్రాలకు చెందిన గిరిజనులను ఎందుకు నిరాశ్రయులను చేసినట్టు? తాగునీరు, సాగునీరు కోసం కడుతున్న ఈ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగమే ఎక్కువ కనిపిస్తోంది.

సరైన అనుమతులు ఏమీ లేకుండా పనులు జరుగుతుండటం ఒక అక్రమమైతే, అందులోనే అవినీతి చోటు చేసుకోవటం సహించరానిది. పోలవరం ప్రాజెక్టుపై ఇంతవరకు చేసిన వ్యయం మీద కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చేత ప్రత్యేకంగా ఆడిట్‌ జరిపిం చాలి. ఆ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి. ఇంతవరకు జరిగిన దుర్వి నియోగాల మీద కేంద్రం దర్యాప్తు చేయించాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితం కావడం సరికాదు. సీబీఐ రంగంలోకి దిగి నిధుల విషయంలో జరిగిన అవకతవకలను కేంద్రానికి తెలియచేయాలి అని పోల ‘వరం’ పై మాజీ IAS ఈఏఎస్‌ శర్మ మాట్లాడుతూ ఇది అంత అధికార పార్టీకి చెందిన నేతల బీనామిలకు ,కాంట్రాక్టర్లకు వరంగా మారింది అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అని సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది ….

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat