రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ల లో ఒకరుగా ఉంటున్న అందాల భామ .వరస హిట్ల తో ఇండస్ట్రీ లో తన కంటూ ఒక స్టార్ డామ్ ను తెచ్చుకుంటుంది .లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ “స్పైడర్ “.రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది .
ఈ నేపథ్యంలో ఈ భామ తన రేట్ ను అమాంతం పెంచేసింది .ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది .రేపు విడుదల కానున్న స్పైడర్ మూవీ ప్రమోషన్ లో అమ్మడు మస్తు బిజీ బిజీగా ఉంది .ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత తర్వాతి ప్రాజెక్టు కోసం రకుల్ ను సంప్రదించాడు అంట .
అంతే అమ్మడు తనకు రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తే సినిమాకు సైన్ చేస్తాను తేల్చి చెప్పింది .దీంతో అమ్మడుకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని సదరు నిర్మాత ఓకే చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేకపోవడంతో సరే అన్నాడు అంట .సో ఇప్పటి నుండి అమ్మడు ప్రతిసారి సినిమాకు రెండున్నర కోట్లు ఇస్తే కానీ మూవీ తీయదు అన్నమాట ..!