Home / MOVIES / త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే

త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే

టాప్ హీరోయిన్‌ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్‌లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్‌తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, న్యూయార్క్ వీదుల్లో ఈ ప్రేమ జంట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆ వార్తలు కూడా ఎప్పటికప్పుడు కోలీవుడ్ మీడియాకు అందుతుండటంతో ఇక తమ మధ్య వున్న బంధాన్ని బయటపెట్టడానికి నయన్ ఏ మాత్రం వెనుకాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకవేళ విగ్నేష్‌ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే, నయనతార అతడి కోసం ప్రత్యేకంగా న్యూయార్క్ వెళ్లేది కాదు కదా..అని అనుకుంటున్నారు సిని వర్గాలు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat