ఎంత తేడా! నలభై ఏళ్ల సీనియర్ ని, దేశంలోనే రాజకీయాలలో నా అంత అనుభవజ్ఞడు లేడు అని చెప్పుకునే టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,పదేళ్ల క్రితమే రాజకీయాలలోకి వచ్చి తనదైన శైలిలో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత ,విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు ఎంత తేడా! ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగుదేశం పార్టీ ఎంత అద్వాన్నంగా మారింది. చంద్రబాబు నాయుడు ఎంత విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారన్నది పోల్చుకోవడానికి. గతంలో ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్లు కొంటారా అని విమర్శించిన చంద్రబాబు సరిగ్గా అదే పనిని చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు.ఇరవై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా చట్ట విరుద్దంగా టీడీపీ లోకి తీసుకుని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే వారికి పచ్చ కండువాలు కప్పి చరిత్రలో నీచ రాజకీయాలు చేశారన్న అపఖ్యాతిని మూటకట్టుకున్నారు.
అదే సమయంలో వైసీపీ లోకి చేరాలనుకున్న టీడీపీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డికి స్పష్టంగా రాజీనామా చేయాలని చెప్పి చేయించడం ద్వారా జగన్ తాను రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నానని మరోసారి లోకానికి చాటారు.చంద్రబాబుపై నైతిక విజయం సాధించారు.రాజకీయం అంటే అనుభవం కాదు.. రాజకీయం అంటే కుట్రలు,ప్రలోభాలు కాదు.. రాజకీయం అంటే విలువలు పాటించాలని జగన్ రుజువు చేశారు. అలా విలువలు పాటిస్తే రాజకీయాలు చేయలేమని, ప్రజలను మభ్య పెట్టలేమన్నది చంద్రబాబు సిద్దాంతంగా కనిపిస్తుంది. అందువల్లే జగన్ నంద్యాల లో ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తే జనం పోటేత్తారు.జేజేలు పలికారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం ఆద్యంతం కూడా ఆసక్తికరంగాను,ఉత్తేజభరితంగాను సాగిందని చెప్పాలి. అయితే ఒకటి,రెండు మాటలు ఆవేశంలో అనకుండా ఉంటే ఇంకా బాగుండేది.
జగన్ ఉపన్యాసం గంటన్నరకు పైగా సాగితే ప్రజలంతా అలాగే నిలబడి విని హర్షధ్వానాలు చేశారంటేనే నంద్యాల ప్రజలు ఎటు వైపు ఉన్నది అర్దం అవుతుంది.ఇక్కడ చిత్రం ఏమిటంటే సభలకు జనాన్ని తరలించడానికి రాజకీయ నేతలు డబ్బు ఖర్చు పెడతారని వింటాంకాని నంద్యాలలో మాత్రం జగన్ సభకు వెళ్లవద్దని తెలుగుదేశం నేతలు ఆయా వాడలలో డబ్బు ,బిర్యాని పంపిణీ చేశారట.అయినా పలువురు టిడిపి వారిచ్చిన బిర్యానీ తిని మరీ జగన్ సభకు తరలివచ్చారు.ఈ సందర్భంగా జగన్ అడిగిన ప్రశ్నలకు టిడిపి నేతలు సమాధానం ఇవ్వగలరా అన్న చర్చ వస్తుంది.21 మంది వైసిపిఎమ్మెల్యేలను రాజీనామాలు చేయకుండా టిడిపిలో చేర్చుకోవడం తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటారా?భూమా నాగిరెడ్డి గత ఎన్నికలలో ఏ టిక్కెట్ పై గెలిచారు.
అలాంటప్పుడు ఈ సీటు ఎవరిది అవుతుంది?నంద్యాలలో వైసీపీ పోటీ చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు నంద్యాలవైపు చూసేవారా?ఇన్నివందల కోట్ల హామీలను ఇచ్చి ఉండేవారా?2014 లో స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లాకు ఇచ్చిన హామీలలో నంద్యాలకు సంబందించినవి కూడా ఉన్నాయి. నంద్యాలను అంతర్జాతీయ సీడ్ హబ్ చేస్తానని, నంద్యాలలో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానని ఇలా ఆయా వాగ్దానాలు ఉన్నాయి.ఈ మూడు సంవత్సరాల కాలంలో వాటిని ఎందుకు పట్టించుకోలేదు?వీటిలో ఒక్కదానికి కూడా టిడిపి నేతల వద్ద సమాదానం దొరకదు. కాగా జగన్ నంద్యాలకు సంబందించి ఇచ్చిన వాగ్దానాలలో జిల్లా కేంద్రంగా మార్చడం ఒక ముఖ్యమైనది అని చెప్పాలి.దీనినే కాకుండా ఇరవై ఐదు జిల్లాలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఆగస్టు మూడో తేదీన జరిగిన సభ వైసీపీ లో ఉత్సాహం ఉరకలెత్తిస్తే, తెలుగుదేశం అదినేతలకు గుబులు పుట్టించేదే.
ఇక ఇప్పుడు తెలుగుదేశం నేతలు మరింత అదికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుంది.డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. టీడీపీ అరాచకాలను ఎదుర్కోవడానికి స్వయంగా జగనే ఈ నెల తొమ్మిది నుంచి నంద్యాలలోనే మకాం చేసి ప్రచారం చేయడం మరో సంచలనం.ఇక తెలుగుదేశం పార్టీ తన మిత్రపక్షమైన బిజెపిని నంద్యాలలో దగ్గరకు కూడా రానివ్వడం లేదట. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో తెలియదు.,ఇప్పటికైతే నంద్యాలలో టిడిపికన్నా వైసిపి కి నాలుగుశాతం ఓట్లు అదికంగా ఉన్నట్లు సర్వేలో తేలిందని ఒక బిజెపి నేత చెప్పారు.అందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కువ కంగారు పడుతున్నారు.దీనికి తోడు జగన్ సభ విజయవంతం కావడం ఆయనకు మరింత ఆందోళన కలిగిస్తుంది.అయినా వైసీపీ అప్రమత్తంగా ఉండవలసిందే.కారణం వేరుగా చెప్పనవసంర లేదు కదా.. Source:Great Andhra ..