మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజానికి చిరస్మరణీయుడని సీఎం కేసీఆర్ అన్నారు. రేపు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయడమే కొండా లక్ష్మణ్ లాంటి గొప్ప వారికి మనం అర్పించే నిజమైన నివాళి అన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
