Home / EDITORIAL / కేసీఆర్ కు మాత్రం తెలంగాణ బాగుండాలె..

కేసీఆర్ కు మాత్రం తెలంగాణ బాగుండాలె..

తెలంగాణ లో కొంత మందికి కాంగ్రెస్ పార్టీ బాగుండాలని ఇంకొంతమందికి బీజేపీ బాగుండాలని కోరికలు ఉన్నయి . కానీ తెలంగాణ బాగుండాలని కోరుకునేది మాత్రం ఒక్క కేసీయారే . ఎందుకంటే ఆయన జాతీయ పార్టీల ఉన్న నాయకుడు కాదు . ఆయన లక్ష్యం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన . ఇప్పుడు బంగారు తెలంగాణ లక్ష్య సాధన . ఆయన ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని వ్యూహాలు రూపొందించినా తెలంగాణ కు ఓ పైసా లాభమన్నా జరగాలనేది కేసీఆర్ ఆకాంక్ష . కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనేది ఆయన సింగిల్ ఎజెండా . దాని కోసం ఆయన భిన్న ఆలోచనలు , వైరుధ్యాలు ఉన్న వాళ్ళతోనూ స్నేహం చేస్తున్నరు . సాధ్యమైనంతవరకు ఒక సానుకూల దృక్పధంతో తెలంగాణ అభివృద్ధి కి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నరు .

కేంద్రంతో , పక్క రాష్ట్రాలతో , భిన్న వైరుధ్యాలు ఉన్న పార్టీలతో తెలంగాణ శ్రేయస్సు కోసం ఓపికగా మంచి నిర్ణయాలకు ప్రాణం పోస్తున్నరు . నిరంతరం ఆయన దృష్టాంతా కోటి ఎకరాలకు సాగు నీరు ఎలా ఇవ్వాలి , మిషన్ భగీరథ ఎలా పూర్తి చెయ్యాలి , పెట్టుబడులు ఎలా తీసుకురావాలి , నిరుద్యోగులకు ఉపాధి ఎలా కల్పించాలి , కుల వృత్తులకు ఎలా మేలు చేయాలి , మొత్తం కోటి కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాలను ఎలా చేపట్టాలని ఆలోచిస్తూ వాటికి తగిన ప్రణాళికలు రూపొందించేలా ప్రయత్నిస్తున్నరు . అయితే ఇన్నాళ్లూ అధికారాన్ని వెలగబెట్టి రాష్ట్రాన్ని పట్టించుకోని కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నరు గాని తెలంగాణ మేలు గురించి కనీస ఆలోచన చేయడం లేదు .

బీజేపీ వాళ్ళు కూడా ఉన్న సీట్లు ఎట్ల కాపాడుకోవాలె అనే ధ్యాసే కాని కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వంతో కోట్లాడి నాలుగు మంచి పనులు చేయిద్దామనే సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నరు . కొత్తగా వచ్చిన రాష్ట్రం . ఎన్నో సమస్యలు , సవాళ్లు . ఇన్నాళ్లు అధికారం వెలగబెట్టిన వాళ్ళ అనుభవం , రాజకీయ దృక్పదం ఏ గంగలో కలిసిందో తెల్వదు . చేసే మంచి పనులకు సహకరించరు . ప్రభుత్వం శ్రద్ధ పెట్టి చేసే పనులకు అడ్డం పడ్తరు .

రాష్ట్రం వచ్చి మూడేళ్లయినా ఇంతవరకు హైకోర్టు ఏర్పడలేదు . బీజేపీ వాళ్లంట ఇంకా తెలంగాణ ను ఉద్ధరిస్తరట . ఎంత సేపు ఢిల్లీ ల ఉండే పార్టీల గురించి తప్ప తెలంగాణ గురించి ఏనాడైనా ఆలోచించిండ్రా . ఇలాంటి దిక్కుమాలిన పార్టీలు మనకు అసలు అవసరమా అనేది ఆలోచించాలి . ఇంకో 10-15 ఏళ్ళు పూర్తిగా కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి గాడిలో పడుతుంది . లేకపోతే 58 ఏళ్ళు సమైఖ్య పాలనలో పడ్డ కష్టాలు మళ్లీ తప్పవు .

By -Mitta SaidiReddy

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat