ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన బంధువులు బ్యాంకు కు ఏకనామం పెట్టారు .అసలు విషయానికి వస్తే రాష్ట్ర సహకార శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు పాలకవర్గంగా ఉన్న రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లాలోనో మంత్రి సొంత నియోజక వర్గ కేంద్రం జమ్మలమడుగు కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ టౌన్ బ్యాంకు లో మొత్తం మూడు కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది .
ఈ బ్యాంకు చైర్మన్ హృషి కేశవరెడ్డి, సీఈవో బాలాజీ పనితీరు వలన ఈ బ్యాంకు దీవాళా తీయడం ఖాయం అని ఈ నెల 22, 23వ తేదీల్లో వరసగా ప్రముఖ దినపత్రిక ‘సాక్షి’లో కథనాలను ప్రచురించింది .ఈ కథనాలు ప్రసారం కావడంతో మేల్కొన్న అధికార యంత్రాంగం విచారణ చేసి బ్యాంకు లో పలు అక్రమాలు జరగడం నిజమేనని తేల్చారు. హృషికేశవరెడ్డి మీద నిన్న సోమవారం పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆయన ఆస్తులు, బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న బ్యాంకు పాలకవర్గాన్ని రద్దు చేసి, జమ్మలమడుగు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి సుబ్బరాయుడును ప్రత్యేకాధికారిగా నియమించారు.అయితే మంత్రి ఆదినారాయణరెడ్డి బంధువు తాతిరెడ్డి హృషి కేశవరెడ్డి ఈ సొసైటీ పాలక వర్గానికి చైర్మన్‌గా, మంత్రి
సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, మంత్రి తమ్ముడు శివనాథరెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మంత్రి బావ, జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ తులసిభర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి కుటుంబం, బంధువర్గం ఆధీనంలో నడుస్తున్న ఈ బ్యాంకులో ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు దాకా రూ.మూడు కోట్లు పక్క దారి పట్టిస్తూ రైతులు ,వ్యాపారులు తమ సోమ్మును యాక్సిస్ బ్యాంకులో దాచుకోనివ్వకుండా చైర్మన్ హృషి కేశవరెడ్డి స్వాహా చేశాడు .