అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల వేదికగా ఒప్పుకున్న సంగతి విదితమే .అయితే బాబు ఆ మాట కావాలని అన్నాడా ..?లేక నోరు జారి ఉన్న వాస్తవాన్ని ఒప్పుకున్నారా అని రాజకీయ వర్గాలు అప్పట్లో విమర్శలు కురిపించిన సంగతి విదితమే .
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికార టీడీపీ పార్టీ నేతలు అవినీతిలో లక్ష కోట్లకు పడక ఎత్తారు అని ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులు పుస్తకాన్నే రీలీజ్ చేశారు .ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులున్నాయి అనే ఆరోపణలతో ఏసీబీ దాడులు నిర్వహించడంతో గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి లో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జివి రఘును సంబంధిత అధికారులు అరెస్ట్ చేశారు .నిన్నటి నుండి సోదాలు నిర్వహిస్తున్నారు .
ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్న కేసులో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ జి.వి.రఘును అరెస్టు చేసి విశాఖపట్నం తరలించారు.అయితే అధికారులు నిర్వహిస్తోన్న పలు సోదాల్లో ఇప్పటికే ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ. 400 కోట్లు అని అధికారులు అంచనా వేస్తున్నారు. నగలకు సంబంధించి శివప్రసాద్ సతీమణి గాయత్రిని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రఘు బినామీలు, వారి ఆస్తుల వివరాలపై తమకు ఇంకా సమాచారం అందుతోందని, వాటిపై కూడా దాడులు చేయనున్నారు అని సమాచారం .అయితే రఘుకు అధికార పార్టీ కి చెందిన నేతలకు మద్య ఎమన్నా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తోన్నారు .