తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు పాల్గొనేందుకు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా దేశంలో 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత వేడుకలను ప్రారంభించి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వేడుకలను వీక్షించేందుకు హాజరయ్యారు. 15 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన బ్రహ్మకుమారీలు రంగురంగుల దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.