తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .
