నేడు మనం ఏ ఛానల్ పెట్టిన కానీ ఇరవై నిమిషాలకు ఒకసారి “మీరు బంగారం ఎక్కడైనా కొనండి .కానీ ఇక్కడ రేట్ తో పాటుగా లలితా జ్యూయలర్స్ అమ్మే నగల ఫోటోలను తీసుకెళ్ళి ఎక్కడైనా ఏ బంగారం షాపులలో ఉన్నవాటితో పోల్చండి .ఇక్కడి వాటితో పోల్చుకుంటే అక్కడ ధర ఎక్కువ ..నాణ్యత తక్కువ అంటూ వ్యాపార ప్రకటనలో షూట్ బూట్ వేసుకొని ఒక వ్యక్తీ వస్తాడు .అంతే కాదు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ఏ కటౌట్ లలో చూసిన కానీ గుండుతో ,మంచి ఆకారంతో కన్పించే వ్యక్తీ ఎవరో తెలుసా ..?. ఆయనే లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ .. ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే ఉద్యోగం లేదని బాధపడే ఎంతో మంది నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాడు .అసలు విషయానికి వస్తే కిరణ్ కుమార్ కి అసలు పాఠశాల అంటే ఏలా ఉంటుందో తెలియదు .అందరిలాగా కిరణ్ చదువుకోలేదు .ఎందుకంటే కిరణ్ ఫ్యామిలీ పేదవారు కావడమే ఇందుకు ప్రధాన కారణం .
ఎడారి తో ఫేమస్ అయిన రాజస్తాన్ రాష్ట్రం నుండి అప్పటి ఉమ్మడి ఏపీలో నెల్లూరు కు కట్టుబట్టలతో ఒక బంగారం షాప్ లో పనికి కుదిరాడు . అలా పనిలో చేరిన కొద్దిరోజులకే ఆయన నేనే ఎందుకు నగల వ్యాపారం చేయకూడదు అని అలోచించి మరి తన కన్నతల్లి చేతికి ఉన్న గాజులతో కొన్ని రకాల నగలను తయారుచేసి మరి తమిళనాడులోని చెన్నై నగరానికి వెళ్లి అమ్మేవాడు .ఈ క్రమంలో అక్కడ లలితా జ్యూయలర్స్ నగల షాప్ కనిపించింది..దీంతో ఆ షాపులోనే అమ్మి ..మరల అక్కడ నుండి ఆర్డర్స్ తీసుకుని ఇంటికొచ్చి మరి తయారుచేసేవాడు .ఇలా కొద్దిరోజులు గడిచిన తర్వాత లలితా జ్యూయలర్స్ షాపు నష్టాల్లో కూరుకుపోయి ఒకానొక దశలో మూసివేసే పరిస్థితులు వచ్చాయి .
ఈ క్రమంలో కిరణ్ కుమార్ తీసుకొని ప్రస్తుతం ఒక్క దక్షణ భారతంలోనే పన్నెండు శాఖలను ఏర్పాటు చేసి దాదాపు పదివేల కోట్లకు పైగా టర్న్ ఓవర్ చేసే ప్రముఖ వ్యాపార సంస్థగా ప్రఖ్యాత చెందటంలో తన వంతు పాత్ర పోషించి ప్రస్తుతం ఆయన లలితా జ్యూయలర్స్ అధినేత కిరణ్ కుమార్ గా ప్రపంచం అంత తెలిసేలా ఉన్నతస్థాయికి చేరారు .ఉద్యోగం లేదు ..ప్రభుత్వం ఏమి చేయడంలేదు అని బాధపడే అందరి నిరుద్యోగ యువత మాదిరిగా ఆలోచించకుండా తనే సొంతగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరిన కిరణ్ కుమార్ నేటి నిరుద్యోగ యువతకు ఆదర్శం .