టాలీవుడ్ ను ప్రస్తుతం కలెక్షన్లతో షేక్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ జై లవకుశ.ప్రముఖ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ,అందాల బామలు రాశి ఖన్నా, నివేదితామాస్ హీరోయిన్లగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం వహించగా బాబీ దర్శకత్వం వహించాడు .ఇటీవల విడుదల అయిన ఈ మూవీ గత నాలుగు ఐదు రోజులుగా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది .
ఈ క్రమంలో ఈ మూవీ విజయోత్సవ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ నిర్వహించింది .ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత ,దర్శకుడు ,మాటల రచయిత అయిన పోసాని కృష్ణ మురళి జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు .ఆయన మాట్లాడుతూ “ప్రస్తుతం సమాజంలో ఎవరికైనా జ్వరం వస్తే ఆ జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్ ఉంది .. నిత్యం మనం వినియోగించే పాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి లాక్టోమీటర్ ఉంది .
అదే విధంగా జూనియర్ నటన ను కొలవడానికి కూడా ఒక పరికరం ఉంది .అదే ఈస్తటిక్ మీటర్ అన్నారు ఆయన .తెలుగు భాషలో రస హృదయం అనేది ఒకటి ఉంది .ఇది ఉన్నవాడికి ఎవరికైనా ఎన్టీఆర్ ఎంత దమ్మున్నోడు అనేది తెలుస్తుంది అని అన్నారు .అంతే కాకుండా ఆయన ఇంకా మాట్లాడుతూ గతంలో తాను జూనియర్ ఎన్టీఆర్‌తో టెంపర్, జై లవకుశ చేశానని.. ఆయనతో యాక్ట్ చేస్తుంటే తానేం కనపడతానని భయపడ్డానన్నారు.కానీ స్క్రీన్ మీద ఎన్టీఆర్ ఒక మెర్క్యురిలా ఎవ్వరినీ యాక్ట్ చేయనివ్వడు.. అంటే దానర్ధం ఎన్టీఆర్ నటన ముందు తామెవ్వరం కనపడం అని చాలా మంది భావిస్తారన్నారు.