ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి.
అనంతపురంలో నవంబర్ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్, టాలీవుడ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని క్రిసెంట్ ఫంక్షన్లో హాలులో నిర్వహించిన కప్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, సినీ హీరోయిన్లు పూనమ్ రౌత్, రిచా, భాను శ్రీ మెహ్రా, కామ్నా జెఠ్మలానీ, పుట్టపర్తి, అనంతపురం శాసనసభ్యులు పల్లె రఘునాథరెడ్డి, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, జిల్లా పరిషత్ ఛైర్మన్ పూల నాగరాజు, అనంతపురం నగర మేయర్ మదమంచి స్వరూప పాల్గొన్నారు.