టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ తన అభిమాన నటితో ఫొటో దిగి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువరాజ్ సింగ్ అబిమాన నటి హీరోయిన్ కాజోల్. తాజాగా వీళ్లిద్దరూ ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోనే ఇది. ‘విమానం రాక ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం’ అని పేర్కొన్న యువీ.. కాజల్‌తో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఇదే ఫొటోను కాజోల్ కూడా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. శ్రీలంక, ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ యువీకి స్థానం కల్పించని సంగతి తెలిసిందే. ప్రస్తుతం యువీ దేశవాళీ క్రికెట్‌లో రాణించేందుకు కసరత్తులు చేస్తున్నాడు.
