అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ గురించి తెలిసిందే..అయితే అంత కన్నా దారుణంగా మరో బాబా రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన 21ఏళ్ల లా విద్యార్థి బాబాపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఆమె ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
బాధితురాలు చెప్పిన వివరాలు బాబా దారుణమైన, చాల నీచంగా కామ వాంఛల్ని బయటపెడుతున్నాయి.
బాబా ఈవిదంగా కామ వాంఛన.. ‘నా నాలుకపై తేనెతో ఓం అనే బీజాక్షరం రాస్తా.. నువ్వు దానిని నాకితే నాలోని జ్ఞానం నీకు ప్రసారమవుతుంది. చాలామందికి ఇదే రీతిలో జ్ఞానాన్ని ప్రసాదించాను.. నువ్వు కూడా పొందు’ అంటూ ఫలహారీ బాబా తనతో చెప్పినట్లు అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
తనపై అత్యాచారం జరిగిన రోజు అగస్టు 7, సాయంత్రం 7.30గం. ప్రాంతంలో తొలుత తనను బాబా గదికి పిలిచారని బాధితురాలు చెప్పింది. తాను లోపలికి వెళ్లగానే శిష్యులను పంపించి తలుపులు మూసేశారని పేర్కొంది. అనంతరం తనను బలవంతంగా పట్టుకుని, కదలకుండా చేశాడని చెప్పుకొచ్చింది. భగవంతుడి ఆదేశం మేరకే ఇదంతా జరుగుతుందని చెబుతూ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిపింది.
తనపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలోనే బయట నుంచి ఎవరో తలుపు కొట్టడంతో.. బాబా హడావిడిగా దుస్తులు ధరించారని బాధితురాలు తెలిపింది. విషయం బయటకు పొక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు పేర్కొంది. ఆ తర్వాతి రోజు బాబా అనుచరులు తనను రైల్వే స్టేషనులో వదిలి వెళ్లిపోయారని తెలియజేసింది.
నిజానికి ఆగస్టు 7న ఆశ్రమానికి వెళ్లిన బాధితురాలు అదే రోజు తిరిగి వచ్చేయాలని అనుకుంది. కానీ ఆ రాత్రికి అక్కడే ఉండమని చెప్పడంతో బాబా మాట కాదనలేకపోయింది. తాను ఎంతోమందిని ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలను చేశానని, నిన్ను ఏకంగా జడ్జినే చేస్తానని బాబా తనతో చెప్పినట్లు బాధితురాలు తెలియజేసింది. అయితే దానికి ప్రతిఫలంగా ఏమిస్తావని అడిగిన బాబా.. తనను మంచంపై తోసేసి.. భగవంతుడి ఆజ్ఞ మేరకే ఇదంతా అని అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
చాలారోజుల వరకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయానని, చివరికి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితురాలు చెప్పుకొచ్చింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో శనివారం కౌసలేంద్ర ప్రపన్నాచార్య అలియాస్ ఫలహారీ బాబా (60)ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు.