Home / MOVIES / బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ.. గెలుపు వెనుక దాగిన నిజాలు..!

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ.. గెలుపు వెనుక దాగిన నిజాలు..!

తెలుగు బుల్లితెర పై 70 రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ వ‌న్‌ విన్నర్ ఎవరు అనే ఉత్కంఠకు ఆదివారంతో తెరపడింది. 10 వారంలోకి వచ్చిన తర్వాత అటు స్టార్ మా యాజమాన్యం, ఇటు హోస్ట్ గా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మంచి హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ఫినాలేలో పోటీపడుతున్న ఐదుగురు హౌజ్ మేట్స్ తరపున ఓట్ల కోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. సామాజిక మాధ్యమాలు, ఫేస్ బుక్ పేజీల్లో ఓట్ల రిక్వెస్టులను కంటెస్టర్లు, వారి బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున నడిపించారు. హోరాహోరీగా ఫినాలే రేస్ నడుస్తోందన్న ఉత్సుకత క్రియేట్ చేయడంలో సక్సెస్ కావడంతో పదకొండున్నర కోట్ల పైచిలుకు మంది ఓట్లేసినట్లుగా వ్యాఖ్యాత జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. శివబాలాజీ బిగ్ బాస్ సీజన్ వ‌న్‌ టైటిల్‌తో పాటు 50 లక్షల ఫ్రైజ్ మనీ గెల్చుకున్నారు. ఫైనల్‌కి చేరిన ఐదుగురు కన్టెస్టెంట్స్‌లో అర్చన 5, నవదీప్ 4, హరితేజ3, ఆదర్శ్ 2 స్థానాల్లో నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఈ పోరులో శివబాలాజీ … ఆదర్శ్ కంటే ఎనిమిదిన్నర లక్షల ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఓట్లు సాధించి బిగ్ బాస్ సీజన్ వ‌న్‌ టైటిల్ విన్నర్‌గా నిలిచారు. మరి శివబాలాజీకే ఎక్కువ ఓట్లు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా..!

 

శివబాలాజీ హౌజ్ లో 70 రోజుల పాటు నిలకడగా గేమ్ ఆడారు. అప్పుడప్పుడు తన సహజ సిద్ధమైన ఎమోషన్స్, కోపతాపాలు ప్రదర్శించినప్పటికీ మళ్లీ వెంటనే రీ బ్యాక్ అయ్యాడు. ఆ హౌజ్ మేట్స్ అందరిలో పెద్ద తరహాగా వ్యవహరించాడు. హౌజ్ మేట్స్ మధ్య చిన్న పాటి వివాదాలు, తగాదాలు తలెత్తినప్పుడు ఓ పెద్దన్నలా సర్దిచెప్పాడు. అన్నింటికంటే ముఖ్యంగా తన వంట ప్రావీణ్యాన్ని చూపించాడు. అంతేకాదు బిగ్ బాస్ నుంచి వారం వారం వచ్చే రేషన్, లగ్జరీ టాస్క్ ల్లో గెల్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అందరికీ సమపాళ్లలో, అన్ని రోజులు అందేలా పక్కా ప్లాన్‌ చేశాడు. శివబాలాజీ ఫుడ్ రిస్ట్రక్షన్స్ తో అనేక మంది తమ ఫేవరెట్ ఐటమ్స్ తినలేక నోరు కట్టేసుకోవాల్సి వచ్చింది. ఆ క్షణంలో వారు నొచ్చుకున్నా.. తర్వాత బాలాజీ రేషన్ ప్లాన్ సక్రమంగా ఉండడంతో ఆయనకు మద్ధతుగా నిలిచారు. ఇక మిగిలిన వంటకాలను రిపేర్ పేరిట తిరిగి వినియోగించడంలోనూ ఆయన చూపిన ప్రావీణ్యం అటు హౌజ్ మేట్స్ నే కాదు ఇటు బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులను సైతం ఫిదా అయ్యేలా చేసింది. మొత్తానికి కోపిష్టిగా ముద్రతో హౌజ్ లోకి అడుగుపెట్టిన శివబాలాజీ తన ఎమోషన్స్ సహజ సిద్ధమైనవి అని చాటిచెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇంట్లో సభ్యుల మధ్యన ఎన్ని గొడవలు ఉన్నా భోజనం తయారు చేయడంలో… హౌస్ మేట్స్ ను జాగ్రత్తగా చూసుకోవడంలో శివబాలాజీ హెడ్ ఆఫ్ ది హౌజ్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సభ్యులకే కాదు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రత్యేక గెస్ట్ లకు, చివరకు జూనియర్ కు సైతం పసందయిన వంటకాలను తాను చేసి, మిగిలిన హౌజ్ మేట్స్ తో చేయించి పెట్టడం ప్రేక్షకులను ఆకట్టుకొన్న అంశాల్లో ఒకటి. మొత్తానికి శివబాలాజీకి మిగిలిన అందరు కంటెస్టర్ల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉండడంతో షో టైటిల్ విన్నర్ గా నిలబెట్టింది.

 

 

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat