తెలుగు బుల్లితెరను ఊపేసిన బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నిలవడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శివబాలాజీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే పరిచయమైన శివబాలాజీ 70 రోజుల తెలుగు బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇక గురించి చెప్పుకోవాలంటే.. శివ అక్టోబరు 14, 1980లో తమిళనాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మనోహర రామిస్వామి, శివకుమారి దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించారు. వారి ఆస్తిపాస్తులు మూడు నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందట. స్వతహాగా వ్యాపార కుటుంబం కావడంతో శివబాలాజీ తొలుత వ్యాపారం చేశాడు. అయితే తనకి నటనపై ఎనలేని ప్రేమ.. అందుకే ఇంట్లో ఎదురించి మరీ సినీ ఇండస్ట్రీకి వచ్చారు. ఆ సమయంలో తండ్రి కొద్దిరోజులు మాట్లాడడం కూడా మానేశారు. అయినా మొక్కవోని దీక్షతో శివ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
2009లో తన స్నేహితురాలు, ఇంగ్లిష్ కారన్ అనే సినిమాలో తన సహనటి అయిన మధుమిత ను వివాహం చేసుకున్నాడు. వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2002 లో వచ్చిన ఇది అశోక్ గాడి లవ్ స్టోరి అనే సినిమా తో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే హీరోగా ఆశించిన స్థాయిలో సక్సస్ రాలేదు. దీంతో చేసేది లేక ఆర్య సినిమాలో నెగటివ్ రోల్ పోషించి టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తరువాత సంక్రాంతి అనే సినిమాలో వెంకటేష్, శ్రీకాంత్ లకు తమ్ముడిగా నటించాడు. తెలుగుతో పాటుగా తమిళ చిత్రాల్లోనూ నటించాడు. శివబాలాజీకి చెల్లెలు గాయత్రి. తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీ, కృష్ణ సాయి ఉన్నారు. చెన్నయిలోనే పుట్టి పెరిగినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీకి బాగా కనెక్ట్ అయ్యాడు. శివ 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు. శివబాలాజీ 17 ఏళ్ళ వయసు నుంచే తనతండ్రి నుంచి సంక్రమించిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. 20 సంవత్సరాల వయసుకే తన సొంత కంపెనీలు స్థాపించాడు. తరువాత వ్యాపారం లేదా సినిమాలలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకోమని తండ్రి సలహా ఇచ్చినపుడు 22 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించాడు. అలా మొదలైన శివబాలాజీ జర్నీ ఓ రియాల్టీ షో టైటిల్ విన్నర్ వరకు సాగింది.