రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది .
ఆ తర్వాత స్టార్ హీరోలతో వరసగా నటించి టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉంది .ఈ క్రమంలో తను ఒక కొత్త బెంజ్ కారుతో ఫోటో దిగి తన సోషల్ మీడియా ఎకౌంటు లో పోస్టు చేసింది .ఇంతకి ఆ కారు ఎక్కడది అనుకుంటున్నారా ..?.
అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, మధ్యలో బాలీవుడ్ వరస చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. దీని గురించి ఆమె ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. ‘నా కొత్త లవ్’ అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేసింది. రకుల్ ప్రస్తుతం ఆడీ క్యూ4 కారును వాడుతోంది.తనే సొంత డబ్బులతో కొన్నారు అని సినీ వర్గాలు అంటున్నాయి ..