తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.
అంతే కాకుండా నగర శివారులోని హయత్నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్నగర్, కర్మన్ఘాట్, కాప్రా, కర్మన్ఘాట్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, ముషీరాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, అత్తాపూర్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, అబిడ్స్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తోంది.