టాలీవుడ్లో ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడి అవకాశం తనకివ్వలేదనే కచ్ఛితోనే వర్మ, ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కిస్తానంటూ బయలుదేరాడు. ఇక బయో పిక్ అనగానే అందులో మంచి, చెడులు రెండూ కనబడాలి కాబట్టి మంచి గురించి ఎవరూ పట్టించుకోకుండా.. ఎక్కడ చెడు విషయాలు బయటికి వస్తాయో అని చాలామంది హడలి చస్తున్నారు. మరి ఎన్టీఆర్ జీవితంలో అతి పెద్ద విలన్ చంద్ర బాబే అంటారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కాలంటే భార్యగా తన అనుమతి చాలంటుంది లక్ష్మి పార్వతి, ఎన్టీఆర్ కొడుకుల అనుమతితో ఈ సినిమా తెరకెక్కల్సిన అవసరం లేదని.. లక్ష్మీస్ ఎన్టీఆర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది లక్ష్మీ పార్వతి.
ఎన్టీఆర్ చివరిరోజుల్లో ఆయన కొడుకులు పట్టించుకోలేదని… ఇప్పుడు తనని పట్టించుకోవడంలేదని లక్ష్మి పార్వతి అలా అంటుంది. మరి రామ్ గోపాల్ వర్మ కూడా తనకి ఈ సినిమాని తెరకెక్కించడానికి తనకెవరి అనుమతి అక్కర్లేదంటున్నాడు. మరి వర్మ చెప్పిన వాటితో ఏకీభవించమని… చంద్ర బాబు ప్రతినిధి బాబు రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు. అసలు రాజేంద్ర ప్రసాద్ ఎవడు అంటున్నాడు వర్మ. ఇక లక్ష్మి పార్వతి అనుమతి ఇచ్చింది అంటే ఈ సినిమా మొత్తం లక్ష్మి పార్వతికి ఫెవర్గా ఉంటుందనడంలో సందేహమే లేదు. అందులో చంద్ర బాబు ఆయన కొడుకులే విలన్స్ అని వేరే చెప్పక్కర్లేదు. మరి వర్మగారు సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో గాని.. సినిమా మొదలుపెట్టకముందే కావాల్సినంత క్రేజ్ కొట్టేస్తుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం. చూద్దాం సినిమా స్టార్ట్ అయ్యాక ఇంకే విధమైన రచ్చ జరుగుతుందోనని సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.