జై లవకుశ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి, ముఖ్యంగా జై పాత్రకు లభిస్తున్న విశేష ఆదరణతో వసూళ్లపరంగా జై లవకుశ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.ఇక ఎన్టీఆర్ నటనకి ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా ఒక్కొక్కటి దాసోహం అయిపోతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ని చేరుకుంది . ఈ వారంలో జై లవకుశ సినిమా ద్వారా అత్యధిక కలెక్షన్స్ తెచ్చుకున్న జూనియర్ ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది.
జై లవకుశకి పోటీకి ఇక ఎ పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడం ఎన్టీఆర్ ప్రభంజనం అప్రతిహతంగా సాగిపోతుంది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వంద కోట్లు మార్క్ చేరుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. స్పైడర్ సినిమా రిలీజ్ కావడానికి మరో రెండు రోజులు సమయం ఉంది ఈ లోపు జై లవకుశ 100 మార్క్ కి క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బయట వినిపిస్తున్న టాక్. లాంగ్ రన్ లో మాత్రం ఎన్టీఆర్ కెరియర్ లో రికార్డు స్థాయిలో 150 కోట్లు వరకు జై లవకుశ కలెక్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అయితే ఈ లోపు స్పైడర్, మహానుభావుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న వేళ అవి ఎంత వరకు జై కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తాయి అనేది చూడాలి.