Home / SLIDER / సింగ‌రేణికి ఇది ఎన్నిక‌ల పంచాయ‌తీ కాదు…55000 కుటుంబాల జీవితం

సింగ‌రేణికి ఇది ఎన్నిక‌ల పంచాయ‌తీ కాదు…55000 కుటుంబాల జీవితం

సింగ‌రేణిలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది ఎన్నికల పంచాయితీ, గెలుపు ఓటముల పంచాయితీ కాద‌ని 55000 కుటుంబాల జీవితమ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయిని సింగరేణి కోసం టీఆర్ఎస్ ఎల్ల‌వేళ‌లా ముందుంటుంద‌ని తెలిపారు. మంథనిలోని సెంటినరీ కాలనీలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు,మనోహర్ రెడ్డీతో క‌లిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగాఆయ‌న మాట్లాడుతూ ఆనాడు అధికారంలో లేకపోయినా సింగరేణి మా శ్వాస అని ప్రైవేటీకరణ చేస్తే ఖబర్దార్ అని అడ్డుకున్న పార్టీ టీఆర్ఎస్ అని, అడ్డుకున్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
గ‌తంలో లాభాల్లో వాటా ఇవ్వబోమని ప్ర‌క‌టిస్తే…కొట్లాడితే 17 శాతం ఇచ్చారని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ గుర్తుచేశారు. తాము మొదటి ఏడాది 18, 2వ సంవత్సరం 21శాతం, 3వ సంవత్సరం 23 శాతం పెంచుకున్నామ‌ని తెలిపారు. తాము ప్రైవేటీకరణ చేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారని అయితే…వారికి సిగ్గు ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ చేయమని ప్రకటించిన ప్రభుత్వం టీఆర్ఎస్ అని స్ప‌ష్టం చేశారు. సింగరేణిని విస్త్రత పరుస్తున్నామ‌ని…విదేశాల్లో కూడా మైనింగ్ చేసి కార్మికులకు లాభాలు అందించే ప్రయత్నం చేస్తున్నామ‌ని మంత్రి ఈట‌ల ప్ర‌క‌టించారు. కార్మికుల సమస్యలు తీర్చే సత్తా టీఆర్ఎస్‌ ప్రభుత్వానికే ఉందని స్ప‌ష్టం చేశారు. అలాంటప్పుడు వేరే సంఘాలను గెలిపించిన వారు మళ్ళీ ప్ర‌భుత్వం ద‌గ్గరికే వస్తారని పేర్కొంటూ….అదే మన సంఘాన్ని గెలిపిస్తే మీ సమస్యలు తీర్చమని అడగకుండానే తీరుస్తామ‌ని ప్ర‌క‌టించారు.
దేశంలో ఇద్దరే ఇద్దరు త్యాగమూర్తులు ఉన్నారని…ఒకరు జవాను అయితే, మరొకరు బొగ్గుగ‌ని కార్మికుడని మంత్రి ఈట‌ల తెలిపారు. అందుకే జవాను లాగా బొగ్గుగని కార్మికుడికి కూడా టాక్స్ లేకుండా చూడాలని కోరిన ప్రభుత్వం టీఆర్ఎస్‌ ప్రభుత్వమ‌ని తెలిపారు. శ్రమదోపిడి చేసిన పార్టీలు అంతం అయిపోయాయ‌ని…ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపిన ప్రభుత్వం త‌మ‌ద‌ని తెలిపారు. ఇది చూసి పార్టీలకు మింగుడు పడక కోర్టులో కేస్ లు వేసి కాళ్ళల్లో కట్టెలు పెట్టి కిలకిలా నవ్వుతున్నారని మంత్రి ఈట‌ల అన్నారు. “డిపెండెంట్ ఉద్యోగాలు ఆగిన తరువాత పెళ్లిళ్లు ఆగినయి, ఆ కుటుంబాల్లో దుఃఖం ఉంది. ఆ బాధను తీర్చేది, వారిని అక్కున చేర్చుకొనేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, తప్ప ప్రతిపక్షాలు కాదు. ఇప్పటికే అనేక విధాలుగా మీ సంఘాల వల్ల కార్మికులు అనేక విధాలుగా నష్టపోయారు. మళ్ళీ అలా జరగనివ్వం.కార్మికులంతా బాణం గుర్తుకు వోట్ వేసుకుందాం, మన హక్కులను కాపాడుకుందాం“ అని మంత్రి ఈట‌ల పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat