ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం అక్రమ కేసులను బనాయించి వేదించిన సంగతి విదితమే .జగన్ పై కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగా అక్రమ కేసులు పెట్టింది .
ఈ విషయాన్నీ ఏకంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ,మాజీ సీనియర్ మంత్రులు కూడా గతంలో చెప్పిన సంగతి విదితమే .జగన్ పై అక్రమ కేసులను బనాయించడం వెనక అప్పటి కేంద్ర హోం అండ్ ఆర్ధిక శాఖ మంత్రి పి చిదంబరం ,ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ,సోనియా గాంధీ ప్రధాన రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ,రాష్ట్రంలో టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కుట్రలు పన్ని చేశారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .
అయితే అప్పుడు జగన్ వేదించడం వలనే ఆయన ఉసురు తగిలి ప్రస్తుతం కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం పలు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నారు .ఈ నేపథ్యంలో పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి భారీ ఎదురు దెబ‍్బ తగిలింది. ఎయిర్ సెల్ మాక్సిస్‌లో సీరియస్‌గా స్పందించిన ఈడీ కోటికిపైగా ఆస్తులను ఎటాచ్ చేస్తూ ఎఫ్‌డీలు, బ్యాంక్ అకౌంట్లతోపాటు గుర్గావ్‌లో ఇంటిని కూడా సీజ్ చేసింది. అంతే కాకుండా కార్తీకి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది.