ఏపీలో మరో భారీ అవినీతి బాగోతానికి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు తెర లేపారు. పౌర సరఫరాల శాఖ పరిధిలోని ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాలను రిలయన్స్, హెరిటేజ్ పార్టనర్ గ్రూపు ఫ్యూచర్ గ్రూపులకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది బాబు సర్కార్. ఫ్యూచర్ గ్రూపు సరిగ్గా డీమానిటైజేషన్‌కు రెండు రోజుల ముందు హెరిటేజ్ గ్రూపును పెద్ద మొత్తాలకు టేకోవర్ చేసింది..డీమానిటైజేషన్ గురించి ముందే తెలుసుకున్న చంద్రబాబు, లోకేష్‌లు తెలివిగా తమ హెరిటేజ్ లో మెజార్టీ వాటాను ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెట్టింది..దీనికి ప్రతిఫలంగా ఫ్యూచర్ గ్రూపుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపున లబ్ది చేకూర్చినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి..అంతే కాదు ఏపీలో హెరిటేజ్,
ఫ్యూచర్ సూపర్ మార్కెట్లో పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇప్పించే ఏర్పాటు చేసింది. దీంతో ఫ్యూచర్, లోకేష్ , బాబుల బంధంపై పెద్ద ఎత్తున చర్చ జరింది..ఇప్పటికీ ఫ్యూచర్ గ్రూపులో తండ్రీ కొడుకులకు భారీగా వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది..ఇక రిలయన్స్‌తో బాబు బంధం గురించి చెప్పనక్కర్లేదు.. చంద్రబాబు ఏపీ సీఎంగా, కే్ంద్రంలో ఎన్టీయే కన్వీనర్‌గా ఉన్న సమయంలో గోదావరి బేసిన్ లో గ్యాస్ బావుల్లో 10 లక్షల కోట్ల విలువ చేసే గ్యాస్‌ను తవ్వుకోనిచ్చాడు..అందుకు ప్రతిఫలంగా రిలయన్స్ గ్రూఫు వాటాదారులకు, సెబీ కి తెలియకుండా రహస్యంగా 1800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు గ్రూప్ లో 2600 కోట్లు పెట్టారు .ఈ విషయం 2011 లో విజయమ్మ బాబు రామోజీ
రిలయన్స్ మీద హై కోర్ట్ లో కేసు వేసినప్పుడు తప్పనిసరి అయి రిలయన్స్ వాళ్ళు అంగీకరించారు కూడా. ఇక రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ లో 4 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అని కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్ చెప్పినా చంద్రబాబు పొరపాటున కూడా రిలయన్స్ వాళ్లను ప్రశ్నించడని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పలు మార్లు విమర్శించారు..2004లో వైఎస్ అధికారంలోకి రావడంతో గోదావరి బేసిన్‌పై రిలయన్స్ ఆధిఫత్యానికి గండిపడింది..వైఎస్ మా గ్యాస్ మాకే దక్కాలి..రిలయన్స్ అప్పనంగా గ్యాస్ అప్పగించేది లేదని తేల్చి చెప్పాడు..దీంతో అంబానీలు సోనియాగాంధీతో చెప్పించినా వైఎస్ విన్లేదు..ఏపీకి చెందిన సహజ చమురు సంపదను రిలయన్స్ దోచుకోవడానికి ఏ మాత్రం అంగీకరించనని స్పష్టం చేశాడు..ఇది జరిగిన కొన్నాళ్లకే వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ మరణం
ప్రమాదవశాత్తు జరిగింది కాదని..దీని వెనుక రిలయన్స్, చంద్రబాబుల హస్తం ఉందని, దీనిపై విచారణ జరపాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంది..కాగా తాజాగా చంద్రబాబు రిలయన్స్‌కు పెద్ద ఎత్తున రేషన్ షాపులను అప్పగించడంతో బాబు, రిలయన్స్ పెద్దల బంధంపై మరో సారి అనుమానం తలెత్తుతుంది.
రిలయన్ప్, ఫ్చూచర్ గ్రూపుల ద్వారా భారీగా లబ్ది పొందిన చంద్రబాబు , లోకేష్‌లు ప్రతిగా ఏపీలోని 13 జిల్లాల రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చి వాటికి సరుకులను అంజేసే బాధ్యతను తమకు అత్యంత ప్రియమైన ఆ రెండు కంపెనీలకు కట్టబెట్టబోతుంది. 10 జిల్లాల్లో రేషన్ షాపులను రిలయన్స్ గ్రూపుకు, మిగిలిన 3 జిల్లాల్లోని రేషన్ షాపులను ఫ్యూచర్ గ్రూపుకు కట్టబెడుతుంది..అంటే ఫ్యూచర్ గ్రూపు రూపంలో ఉన్న హెరిటేజ్ గ్రూపుకే 3 జిల్లాల్లో రేషన్ షాపులకు సరుకులు అందించే బాధ్యతను అప్పనంగా అప్పగిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. మొత్తంగా తమకు భారీగా ఆదాయం సమకూర్చిన రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపులకు ప్రతిగా చంద్రబాబు, లోకేష్‌లు కల్సి ఇలా అనైతికంగా ఒక ప్రభుత్వం
ఆధీనంలోని ప్రజా పంపిణీ వ్యవస్థనే కార్పొరేటీకరించబోతుంది.దీంతో ప్రభుత్వ రేషన్ షాపులకు సరులకును అందించే కొన్ని వేల చిల్లర వ్యాపారుల కుటుంబాల పొట్టలు కొట్టబోతుంది బాబు సర్కార్. ఇది ఒక రకంగా క్విడ్‌ఫ్రోకో కిందకే వస్తుంది..క్విడ్ ఫ్రోకో అనే పదాన్ని ఎల్లోమీడియా జగన్ అక్రమాస్థుల కేసుల్లో విరివిగా వాడేది..వైఎస్ హయాంలో ప్రభుత్వం వల్ల లబ్ది పొందిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, సూట్‌కేసు కంపెనీలు జగన్‌కు సంబంధించిన సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు ఇది క్విడ్‌ఫ్రోకో కిందకే వస్తుందని తెలుగుతమ్ముళ్లు, ఎల్లోమీడియా గొంతు చించుకుని నానా యాగీ చేసింది. మరి ఇప్పుడు తమ అనుకుల ప్రభువుకు వేల కోట్లు దోచిపెట్టిన కార్పొరేట్ కంపెనీలకు ప్రతిగా ఇలా ప్రజా పంపిణీ
వ్యవస్థను కట్టబెట్టడం క్విడ్‌ఫ్రోకో కిందకే వస్తుంది..దీనిపై ఇంత వరకూ ఒక్క ఎల్లోమీడియా కూడా స్పందించలేదు…ఇంత నిస్సిగ్గుగా పేదల పొట్ట కొడుతూ తమ అనుకుల కార్పొరేట్ కంపెనీలకు రేషన్ షాపులను ధారబోస్తూ వారికి ప్రతి ఏటా భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చబోతున్న చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి బాగోతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది..ప్రతిపక్ష వైసీపీ పార్టీ కార్పొరేట్ కంపెనీలైన రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపులకు చంద్రబాబుకు, లోకేష్‌లకు ఉన్న ఫెవికాల్ బంధాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి వారి అవినీతి బండారాన్ని బయటపెట్టడానికి సిద్ధమతుంది..జగన్ కేసుల్లో క్విడ్‌ఫ్రోకో అంటూ కాకుల్లాగా మొత్తుకున్న ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు తమ అను`కుల` ప్రభువుకు లబ్ది చేకూర్చిన కార్పొరేట్ కంపెనీలకు ప్రజా పంపిణీ వ్యవస్థను క్విడ్‌ఫ్రోకో విధానంలో కట్టబెడుతుంటే నోరుమూసుకున్నాయి. తద్వారా చంద్రబాబు, లోకేష్ ల అవినీతిలో తామూ భాగస్వాములు అవున్నాయి..రేపటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద విప్లవం, చంద్రబాబు దార్శనికత, రేషన్ షాపుల్లో ప్రజలకు నాణ్యమైన వస్తువులు అని పిచ్చిగా పబ్లిసిటీ చేసినా ఆశ్యర్యం లేదు..ఇలా ప్రతి నెలా రేషన్ షాపులకు సరుకులు సరఫరా చేసినందుకు ప్రతిగా రిలయన్స్, ఫ్యూచర్ గ్రూపులకు ఏటా వేల కోట్లు కట్టబెట్టడానికి బాబు సర్కార్ సిద్ధమయింది..ప్రతిగా చంద్రబాబు, లోకేష్‌లకు నెల నెలా వందల కోట్లు కమీషన్లు ముడతాయని ఏపీ పౌరసరఫరా శాఖలో చర్చ జరుగుతోంది.