ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయ ఉద్యోగుల చేతిలో సీఎం చంద్రబాబుకు ఘోర అవమానం
జరిగింది.వెలగపూడిలోని నూతన సచివాలయంలో చంద్రబాబు ఫొటో పట్ల విద్యాశాఖ ఉద్యోగులు
అవమానకరరీతిలో ప్రవర్తించారు.తాము అల్పాహారం తిన్న ప్లేట్లను చంద్రబాబు ఫోటోపై పడేసి వెళ్లిపోయారు. సోమవారం నాడు సచివాలయం నాలుగో బ్లాక్‌లోని కాన్షరెన్స్ హాల్‌లో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీసీ సమీక్షా సమావేశం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న మీటింగ్ హాల్‌లో చంద్రబాబు ఫోటోతో పాటు కొన్ని దేవుళ్ల ఫొటోలు కూడా ఉన్నాయి..ఉన్నాయి. వాటిని గోడకు తగిలిచేందుకు తెచ్చిన సిబ్బంది వాటిని నిర్లక్ష్యంగా టేబుల్‌పైనే ఉంచారు..అయితే సోమవారం ఈ హాల్‌లో రివ్యూ మీటింగ్ జరిపిన విద్యాశాఖ అధికారులు పేపర్ ప్లేట్లలో అల్పాహారం తెప్పించుకుని తిన్నారు..అయితే అయితే ఆ ప్లేట్లను పెట్టుకునేందుకు సీఎం ఫొటో ఉన్న టేబుల్ ను అధికారులు డస్ట్‌బిన్‌గా వాడుకున్నారు. తిన్న తరువాత కూడా ఆ ప్లేట్లను చంద్రబాబు ఫోటోపైనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. ప్రభుత్వాధినేత ఫొటోను కూడా పట్టించుకోకుండా డస్ట్‌బిన్‌గా వాడుకోవటం పట్ల అధికారుల తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది..
చంద్రబాబు ఫోటోపై ఉన్న చెత్త ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది.. అన్ని శాఖల ఉద్యోగుల పనితీరుపై నిఘా పెట్టి అవసరం లేని శాఖల్లో ఉన్న పోస్టులను తొలగిస్తానంటూ ఉద్యోగుల పట్ల అమానుషంగా వ్యహరిస్తున్నందుకే వారు చంద్రబాబు ఫోటోపై ఇలా ఎంగిల్ ప్లేట్లను పడేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది.. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి సెక్రటేరియట్‌లో ఉద్యోగుల చేతిలో చంద్రబాబు ఫోటోకు జరిగిన పరాభవం 2004 నాటి ఎన్నికల ముందు వాతావరణాన్ని గుర్తు చేస్తోంది..9 ఏళ్ల పాటు తమను పీడించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా ఏకమై 2004 ఎన్నికల్లో వైఎస్‌ను గెలిపించారు..ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందని..ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబును ఓడించి వచ్చే ఎన్నికల్లో జగన్ని గెలిపించడం ఖాయమని..ఈ ఫోటో ఉదంతం తెలియజేస్తుందని సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది.