భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బిఎస్ఎన్ఎల్)- ‘డైరెక్ట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్’ (డిఆర్ – జెఎఒ)- పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 996(ఆంధ్రప్రదేశ్‌కు 72 పోస్టులు, తెలంగాణకు 19 పోస్టులు కేటాయించారు)
అర్హత: జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంకాం/ సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ సిఎస్ పూర్తిచేసి ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఆన్లైన్ కాంపిటేటీవ్ ఎగ్జామినేషన్ 2017 ద్వారా
ఆన్లైన్ కాంపిటేటీవ్ ఎగ్జామినేషన్ 2017 జరుగే తేదీ: నవంబరు 5న
కాంపిటేటీవ్ ఎగ్జామ్ వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం ఇస్తారు. మొదటి పేపర్ 150 మార్కులకు ఉంటుంది. 100 మార్కులకు జనరల్ ఇంగ్లీష్ ప్రశ్నలు, 50 మార్కులకు జనరల్ ఆప్టిట్యూట్/ అవేర్నెస్ ప్రశ్నలు ఇస్తారు. రెండో పేపర్ 300 మార్కులకు ఉంటుంది. ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్/ కాస్ట్ అకౌంటింగ్/ ట్యాక్స్ అండ్ కమర్షియల్ లాస్ సంబంధిత ప్రశ్నలు ఇస్తారు.
పరీక్ష ఫీజు: రూ.1000(ఎస్సీ/ ఎస్టీలకు రూ.500)
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 15
వెబ్సైట్: www.externalexam.bsnl.co.in
www.bsnl.co.in