తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని రీతిలో 70 రోజుల పాటు ఎంటర్ టైన్ మెంట్ అందించిన బిగ్‌బాస్ షో ఫస్ట్ సీజన్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాటిస్పెంట్గా పాల్గొన్న సెలబ్రటీల గురించి ఓ ఆశక్తికర అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన పరిణామాలు గమనిస్తే.. బిగ్‌బాస్ వల్ల కొందరికి మేలు చేస్తే.. మరి కొందరికి మైనస్‌గా మారాయి. ప్రధానంగా కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు.. ఈ ప్రోగ్రాంతో బాగా అభాసుపాలయ్యి.. అయోమయం అవార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు తనకు ఉన్న మంచి క్రేజ్‌ను పోగొట్టుకున్నాడు. అలానే గాయని మధుప్రియ పాట గురించి అందరికి తెలుసు.. ఇప్పుడు ఆమె ఏడుపు ఎలా ఉంటుందో తెలిసిందే. దీంతో ఆమె గుండెల్లో గోదారి అవార్డును సొంతం చేసుకుని ఏడుపుకు బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపుపొందారు.
ఇక సెక్సీ స్టార్ ఇమేజ్ ఉన్న ముమైత్ ఐటమ్ సాంగ్స్ ను అందరు ఇష్టపడుతారు. ఆమె బిగ్ బాస్ లో మగరాయుడిలా చేసి.. అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. మరో గాయని కల్పన ఇమేజిపైనా ప్రభావం కనిపిస్తోంది. అదే సమయంలో పెద్దగా అవకాశాలేమీ లేని ప్రిన్స్, ఆదర్శ్ వంటివారికి మాత్రం ఇది బాగా కలిసొచ్చింది. అలాగే ధనరాజ్, హరితేజ, అర్చనలకు ప్లస్ అయింది. మొదట్లోనే బయటకు వచ్చేసిన జ్యోతికి ఈ షోతో కొత్తగా వచ్చిందీ లేదు, పోయిందీ లేదు. సమీర్కి కూడా పెద్ద ఉపయోగం లేదని తెలుస్తోంది. కత్తి కార్తీక తాజాగా పాపులర్ అయిన బతుకమ్మ వీడియో సాంగ్స్ లో హైలైట్ కావడం వెనుక బిగ్ బాస్ ఇంపాక్ట్ ఉందనుకోవాలి. మహేష్ కత్తి బిగ్‌బాస్ తో సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. ఇక శివ బాలజీ బిగ్‌బాస్ సీజన్ టైటిల్ సాధించడమే కాకుండా అతని సినీ కెరీర్ కూడా దూసుకుపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.