ఏపీ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరో భారీ కుంభ కోణానికి తెర లేపారా ..?.గత మూడున్నర ఏండ్లుగా అనేక కుంభ కోణాలు ..పలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చిన ఏ మాత్రం వెనకాడని టీడీపీ సర్కారు రాష్ట్రంలో భారీ మొత్తం లో అవినీతికి పాల్పడుతుందా ..?.అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి .ఈ క్రమంలో గాలి (పవన ) పవన విద్యుత్ ద్వారా భారీ స్కామ్ కు తెర తీసింది టీడీపీ సర్కారు .
ఈ క్రమంలో పవన విద్యుత్ ద్వారా భారీ స్థాయిలో 1000 కోట్ల కుంభకోణానికి ప్రణాళికలు రచించారు .తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ సంస్థ పవన విద్యుత్ యూనిట్‌కు 3. 46 రూపాయలకే సప్లై చేయడానికి సుముఖం వ్యక్తం చేసింది .కానీ బాబు సర్కారు మాత్రం యూనిట్‌కు రూ. 4.84 లు ముట్ట జెప్పి మరో సంస్థకు బాధ్యతలు అప్పజెప్పడానికి రెడీ అయింది .అయితే కేంద్ర సర్కారు సాంప్రదాయేతర విద్యుత్ కొనుగోలుకు బిడ్డింగ్ టైపు పోటి ఉండాలని ఆదేశాలను స్పష్టంగా తెలిపింది .
కానీ కేంద్ర సర్కారు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కుతూ బాబు సర్కారు సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ నుండి పవన విద్యుత్ కొనుగోలు చేయడానికి సిద్ధమైంది .దీని గురించి ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం బయట అతితక్కువ ధరకే పవన విద్యుత్ దొరుకుతున్నందున యూనిట్ రూ. 4. 84కు కొనుగోలు దారుణం అని ఆయన అన్నారు .అంతే కాకుండా ప్రస్తుతం 12,014 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంది .దీంతో రానున్న మూడేండ్ల వరకు కొత్త విద్యుత్ ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు .
కానీ చంద్రబాబు ఆదేశాలతో కేబినెట్ మాత్రం దిన్ని పక్కన పెట్టేసి వెయ్యి కోట్ల కుంభ కోణానికి తెర తీసింది వార్తలు వస్తోన్నాయి .