ఏపీ క్యాబినేట్‌లో చంద్రబాబు తనయుడు లోకేష్ కోసం ముఖ్యనేతకు మొండి చెయ్యి చూపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు. మండలిలో ఆ బాధ్యతను యనమల రామకృష్ణుడు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలోనే ఆ కీలక బాధ్యత చినబాబుకు దక్కబోతోందని తెలుస్తోంది. యనమలను తొలగించి లోకేష్‌ని నియమించాలని చూడడమే ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. శాసనమండలిలో తొలిసారిగా అడుగుపెడుతున్న లోకేశ్‌కు అలాంటి కీలక వ్యవహారంలో కిరీటం పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శాసనసభా వ్యవహారాలలో తలపండిన యనమలను తొలగించి నారా లోకేష్ ను నియమించాలనుకోవడం చాలామందిని నేతలను విస్మయానికి గురిచేస్తోంది.
ఇప్పటికే దానికి సంబంధించిన సమాచారాన్ని యనమలకు అందించినట్టు ప్రచారం సాగుతోంది. త్వరలో మండలిలో అడుగుపెట్టకబోతున్న నారా లోకేష్ కింది యనమల పనిచేయాల్సిన పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం విపక్షాన్ని అడ్డుకోవడంలో చిక్కులు తప్పవని.. లోకేష్‌ని రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసే పనిలో చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టే ప్రమాదం ఉందని టీడీపీ సీనియర్లే అబిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే క్యాబినేట్ విస్తరణతో అసంతృప్తి జ్వాల ఎలా చెలరేగిందో అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు తాజా పరిణామంతో యనమల తీవ్ర అసంతృప్తికి గురి కావడం కాయమని.. అయితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటందో అని టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.