హైదరాబాద్ నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ కెమెరాలకు అధికంగా నిధులు ఇవ్వాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ఉగ్రవాదం, నక్సలిజం అరికట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. కులమతాల చిచ్చుపెట్టే సంఘ విద్రోహశక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
Tags CC Camera Home Minister Nayani Start