తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన ప్రజారంజకపాలనను సామాన్యులు బతుకమ్మ పాటలుగా మలుచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఆదివారం బతుకమ్మ సంబురాల్లో భాగంగా తడకమడ్ల రూప అనే మహిళ సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై పాడిన పాట అందరినీ ఆకట్టుకున్నది. ఆమె పాటకు మహిళలంతా కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కేసీఆర్ పోరాటపటిమ, సర్కారు సంక్షేమపాలనపై కుమార్తెలు తడకమడ్ల ఉమ, తడకమడ్ల విజయ రాసిన ఉయ్యాల పాటను.. తల్లి రూప పాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
భరతదేశమందు ఉయ్యాలో.. ఓ రాజు పుట్టెను ఉయ్యాలో
ఆ రాజు పేరేమో ఉయ్యాలో.. చంద్రశేఖరుడంట ఉయ్యాలో
తెలంగాణకై ఉయ్యాలో.. పోరాడినాడు ఉయ్యాలో
విందైనా పోలేదు ఉయ్యాలో.. తిండైనా తినలేదు ఉయ్యాలో
నీళ్లయినా తాగలే ఉయ్యాలో.. ఉమ్మయినా మింగలే ఉయ్యాలో
ఓ పట్టుబట్టి ఉయ్యాలో.. సాధించె రాష్ట్రంబు ఉయ్యాలో..
బంగారు తెలంగాణ ఉయ్యాలో.. తెచ్చి చూపించిండు ఉయ్యాలో
అందుకే ఆ రాజు ఉయ్యాలో.. అందరికీ దేవుడు ఉయ్యాలో.
పూర్తి పాట మీకోసం…
పెద్ద సార్ గురించి ఓ ఆడపడుచు బతుకమ్మ పాట … Like and Share
Опубліковано TRS Party Fans Page 24 вересня 2017 р.