తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు.
