ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇప్పటివరకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ..ఇద్దరు ఎంపీలు అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు .దీంతో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలలో నలుగురుకి మంత్రి పదవులిచ్చి ఘనంగా సత్కరించాడు .
ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ,చీఫ్ విప్ ,అసెంబ్లీ స్పీకర్ ,ముఖ్యమంత్రిగా చేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి చెందిన వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని జిల్లా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి .రాష్ట్ర విభజన తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జై సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పార్టీను స్థాపించి ఎన్నికల్లోకి వెళ్లి ఘోర పరాభవం పొంది ఆ తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు .తాజాగా ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తనయుడు అయిన నల్లారి అమరనాథరెడ్డి లేటెస్ట్ గా తెరపైకి వచ్చారు.
ఈ క్రమంలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజక వర్గంలో పర్యటిస్తూ పలు సమావేశాల్లో హాజరావుతున్నారు .ఈ సందర్భంగా నల్లారి అమరనాథరెడ్డి కూడా తన తండ్రి కిశోర్‌కుమార్‌రెడ్డి వెంబడి తిరగడం పలు చర్చలకు తావునిస్తుంది .సరిగ్గా ఇరవై ఐదేండ్లు ఉన్న అమరనాథ్ రెడ్డి ఇటీవల వైద్య విద్యను పూర్తిచేశారు .ప్రస్తుతం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రావాలని అలోచిస్తోన్న అమర్‌నాథ్‌రెడ్డి ఇప్పటి నుంచే పీలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమైకం అవుతున్నారు .అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తోన్న అమరనాథ రెడ్డి తొలి ప్రయత్నంలోనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్న నల్లారి ఫ్యామిలీ వైసీపీ తరపున పోటి చేస్తేనే గెలుస్తాం అని ఆలోచనలో ఉన్నారు అంట .దీంతో నల్లారి ఫ్యామిలీ రీఎంట్రీ వైసీపీ పార్టీ నుండి ఉండొచ్చు అని నల్లారి అనుచరవర్గం గుసగుసలు ఆడుకుంటున్నారు .