రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది.
అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం లేదు. కానీ రానున్న కొద్దిరోజుల్లో వాట్సాప్‌లో పంపిన సందేశాన్ని వెనక్కి తీసుకోవడానికి ‘రీఓక్/ రీకాల్’ అని పిలువబడే ఈ ఆప్షన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ద్వారా మనం పంపిన మెసేజ్ అవతలి వ్యక్తి చూడనంతవరకు.. అనగా మనకు డబుల్ బ్లూ టిక్ కనిపించనంత వరకు మనం ఆ మెసేజ్‌ని డిలీట్ చేయడం/వెనక్కి తీసుకోవడం చేయవచ్చు. ప్రస్తుతం కొందరితో టెస్ట్ చేస్తున్న ఈ ఆప్షన్ అతిత్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.
Tags Feature Technology Trending Watsapp